
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మూడో పాటను రిలీజ్ చేశారు.
'హుడియో హుడియో' అంటూ సాగే ఈ గీతాన్ని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో హుషారుగా ఉండేలా తనదైన శైలిలో అద్భుతంగా స్వరపరిచారు. మాస్ చిత్రానికి తగ్గట్టుగా ఓ సరికొత్త మెలోడీని అందించారు. సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ తన మనోహరమైన స్వరంతో భీమ్స్‌తో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'తు మేరా లవర్', 'ఓలే ఓలే' గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.