
గత కొన్నాళ్లుగా రవితేజ చేస్తున్న సినిమాలు అయితే చేస్తున్నాడు గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 'మాస్ జాతర' అనే మూవీ చేశాడు. ఈనెల 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా ఓ మాదిరి వైరల్ అయ్యాయి. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: చెప్పడం మర్చిపోయాను.. క్షమించండి: ఎన్టీఆర్)
రవితేజ సినిమా అంటే ఏయే అంశాలు ఉంటాయో.. 'మాస్ జాతర' టీజర్ అలానే ఉంది. కామెడీ, ఫైట్స్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ మూవీలో రవితేజ.. రైల్వే పోలీస్‌గా కనిపించబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు.. ఈ మూవీతో పరిచయమవుతున్నాడు. నాగవంశీ.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా రవితేజ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)