చెప్పడం మర్చిపోయాను.. క్షమించండి: ఎన్టీఆర్ | Jr Ntr Special Thanks To Telangana Govt | Sakshi
Sakshi News home page

NTR: వార్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రత్యేకంగా ఓ వీడియో

Aug 11 2025 10:30 AM | Updated on Aug 11 2025 10:48 AM

 Jr Ntr Special Thanks To Telangana Govt

ఎన్టీఆర్ హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా 'వార్ 2'. హృతిక్ రోషన్ మరో హీరో. ఈ గురువారం మూవీ థియేటర్లలోకి రానున్న సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ విషయం చెప్పడం మర్చిపోయిన తారక్.. ప్రత్యేకంగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. క్షమించాలి అని అంటూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)

'వేదికపై ముఖ్యమైన విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. నా 25 ఏళ్ల కెరీర్‌ని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పు జరిగింది. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అలానే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వారందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. మీరు చాలా సహకారం అందించారు. అభిమానులని ఎంతో బాధ్యతగా చూసుకున్నారు. వారి ఆనందానికి కారణమయ్యారు' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్, హృతిక్ చేసిన 'వార్ 2' సినియా.. యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగం. కియారా అడ్వాణీ హీరోయిన్ కాగా అయాన్ ముఖర్జీ దర్శకుడు. తెలుగులో సితార ఎంటర్ టైన్‌మెంట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అందుకే ఆదివారం రాత్రి ఈవెంట్‌లో నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బాగోలేకపోతే తనని పదింతలు ఎక్కువ తిట్టండి అని ఛాలెంజ్ చేశారు. మరోవైపు తారక్ కూడా చిత్ర ఫలితంపై నమ్మకంగా ఉన్నారు. హృతిక్‌తో కలిసి కాలర్ ఎగరేసి మరీ నమ్మకాన్ని చూపించారు.

(ఇదీ చదవండి: ఆంధ్రాకు షిఫ్ట్ అయిన సినీ కార్మికుల వివాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement