
వేతనాల పెంపు కోసం సినీ కార్మికుల చేస్తున్న సమ్మె ఎనిమిదో రోజుకి చేరింది. మొన్నటివరకు ఒకటి అరా షూటింగ్స్ జరిగాయి కానీ నేటితో (ఆగస్టు 11) అన్ని సినిమాల షూటింగ్స్ బంద్ అయ్యాయి. ఈ మేరకు ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది. అలానే సినీ కార్మికుల వేతన సవరణ వివాదం ఆంధ్రప్రదేశ్‌కి షిఫ్ట్ అయింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)
సోమవారం (ఆగస్టు 11) మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో టాలీవుడ్ నిర్మాతలు సమావేశం కానున్నారు. వీరిలో కేఎల్ నారాయణ, మైత్రీ రవి శంకర్, టీజీ విశ్వ ప్రసాద్, దిల్ రాజు, నాగ వంశీ, సాహు గారపాటి, భరత్ భూషణ్, స్వప్న దత్, యూవీ వంశీ, వివేక్ కూచిభొట్ల, డీవీవీ దానయ్య, బీవీఎస్ఎన్ ప్రసాద్, బన్నీ వాసు ఉన్నారు. మరి సమావేశంలో ఏయే విషయాలు చర్చిస్తారనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హీరో రానా)