
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా.. నేడు (ఆగస్టు 11) ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇతడికి గతంలోనే ఓసారి నోటిసులు ఇస్తే.. తన ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు చెప్పాడు. ఈడీని కాస్త సమయం కోరాడు. దీంతో రానాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. 11వ తేదీన ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.
(ఇదీ చదవండి: ఆయన దీవెనలు ఉన్నంత కాలం నన్నెవరూ ఆపలేరు: ఎన్టీఆర్)
ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. తమ వెర్షన్ చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్‌ని 6 గంటలు విచారించగా, విజయ్ దేవరకొండని అధికారులు 4 గంటల పాటు విచారించారు. మరి రానా ఈరోజు విచారణకు హాజరవుతాడా లేదా అనేది చూడాలి? అలానే ఈ బుధవారం అంటే 13వ తేదీన మంచు లక్ష‍్మి హాజరు కావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)