మాస్ మహారాజా మాస్ జాతర.. యాక్షన్‌ ట్రైలర్‌ వచ్చేసింది | Mass Maharaja Ravi Teja Latest Movie Mass Jathara Trailer Out Now | Sakshi
Sakshi News home page

Mass Jathara Trailer: రవితేజ-శ్రీలీల మాస్‌ జాతర.. యాక్షన్‌ ట్రైలర్‌ చూశారా?

Oct 27 2025 7:03 PM | Updated on Oct 27 2025 8:30 PM

Mass Maharaja Ravi Teja Latest Movie Mass Jathara Trailer Out Now

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న ఫుల్‌ యాక్షన్‌ మూవీ మాస్ జాతర. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజైన సూపర్ డూపర్‌ ఆనే సాంగ్‌ను రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

రిలీజ్ తేదీ మరో మూడు రోజులే ఉండడంతో ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే మాస్ జాతర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.  ఈ చిత్రంలో రైల్వే  పోలీస్‌ లక్ష్మణ్‌ భేరి పాత్రలో మాస్ మహారాజా కనిపించనున్నారు. ఈ మూవీలో రవితేజకు ప్రతినాయకుని పాత్రలో నవీన చంద్ర నటించారు. ఈ భారీ యాక్షన్ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా  అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ట్రైలర్ చూస్తుంటే రవితేజ మరోసారి మాస్ హీరోగా ఆడియన్స్‌ను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రైల్వే ఎస్సైగా మాస్ మహారాజా సరికొత్తగా కనిపించనున్నారు. ట్రైలర్‌ రైల్వేస్టేషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఫైట్స్, విజువల్స్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రైల్వేలో ఈస్ట్‌ జోన్, వెస్ట్‌ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ ఉంటాయి.. నేను వచ్చాక ఒకటే జోన్‌.. వార్ జోన్‌ అనే డైలాగ్ మాస్ ఆడియన్స్‌ను ‍అలరిస్తోంది. 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement