సినిమా సెలబ్రిటీల్లో కొందరు మైక్ అందుకోగానే నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. తమ సినిమాల గురించి ఆహా ఓహో అనే రేంజులో పొగిడేస్తుంటారు. అయితే ఇలా వర్కౌట్ అయిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. రీసెంట్‌గా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఇలానే పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు.
అసలు విషయానికొస్తే 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్.. 'ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుంది. చూసి షాక్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను' అని చెప్పారు. గత శుక్రవారం సాయంత్రం షోలతో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు వీకండ్ పూర్తయిన తర్వాత ఫలితం తేలిపోయింది. రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్ పడింది! దీంతో పలువురు నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్‌ని మళ్లీ గుర్తుచేస్తున్నారు. మాట మీద నిలబడి ఇండస్ట్రీని వదిలేస్తారా అని కామెంట్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: శివగామిని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇలా మార్చేశారేంటి!)
ఇప్పుడే కాదు గతంలోనూ ఒకరిద్దరు యంగ్ హీరోలు ఇలానే తమ సినిమా రిలీజులకు ముందు.. హిట్ అవ్వకపోతే పేరు మార్చుకుంటూ అది ఇది అని నోరుజారారు. తీరా మూవీ రిజల్ట్ తేడా కొట్టేసిన తర్వాత ఏదో కవర్ చేశారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అలాంటి కవర్ డ్రైవ్స్ ఏమైనా వేస్తారా? లేదంటే సరదాకే అలా అన్నాను అని అంటారా అనేది చూడాలి?
గతంలోనూ పలు ఈవెంట్స్ సందర్భంగా అలీ, రోజా, డేవిడ్ వార్నర్‌పై నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడిచ్చిన స్టేట్‌మెంట్‌కి సినిమాకు వచ్చిన ఫలితానికి ఏమని స్పందిస్తారో చూడాలి? మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే మాట్లాడిన హీరో రవితేజ కూడా.. గత కొన్ని మూవీస్‌తో చిరాకు పెట్టాను, ఈసారి హిట్ కొట్టబోతున్నాం అని అన్నారు. తీరా చూస్తే 'మాస్ జాతర'.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. చూస్తుంటే సెలబ్రిటీలు.. స్టేట్‌మెంట్ ఇచ్చే విషయంలో ఆచితూచి మాట్లాడటం అవసరం అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 మూవీస్.. అవి మిస్ అవ్వొద్దు)


