శివగామిని ఇలా మార్చేశారేంటి! | Ramya Krishnan Look Police Station Mein Bhoot Movie | Sakshi
Sakshi News home page

Ramya Krishnan: రమ్యకృష్ణని ఇలా ఎప్పుడూ చూడలేదు!

Nov 3 2025 12:58 PM | Updated on Nov 3 2025 1:11 PM

Ramya Krishnan Look Police Station Mein Bhoot Movie

రమ్యకృష్ణ పేరు చెప్పగానే ఇప్పటి జనరేషన్‌కి అయితే శివగామి పాత్ర గుర్తొస్తుంది. ఎందుకంటే 'బాహుబలి'లో ప్రభాస్, రానానే కాదు రమ్యకృష్ణ తన యాక్టింగ్‌తో చూపించిన డామినేషన్.. ఈమె సెకండ్ ఇన్నింగ్స్‌కి మంచి పునాది వేసింది. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రమ్యకృష్ణ.. మునుపెన్నడూ లేని విధంగా ఓ దెయ్యం సినిమా కోసం కనిపించనుంది. ఆ లుక్స్ ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి.

(ఇదీ చదవండి: ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ)

గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోతున్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ప్రస్తుతం 'పోలీస్ స్టేషన్ మైన్ భూత్' అనే హారర్ మూవీ తీస్తున్నాడు. మనోజ్ బాజ్‌పాయ్ పోలీస్‌గా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఈ చిత్రం గురించి చెప్పిన ఆర్జీవీ.. ఓ డాన్ చనిపోయి దెయ్యమవుతాడని, తర్వాత పోలీసులని ఎలా ఇబ్బంది పెట్టాడనేది కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటిస్తోందని, ఆమె లుక్ ఇదేనంటూ ఆర్జీవీ రెండు ఫొటోలని పోస్ట్ చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మాసీగా కనిపించింది. చేతిలో సిగరెట్, ముఖంపై బొట్లు, జీన్స్ ప్యాంట్ ఇలా టామ్ బాయ్ తరహాలో కనిపించింది. అయితే ఈమెది దెయ్యం పాత్ర కాదని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్‌గానే 'బాహుబలి' మూవీ ఎపిక్ పేరిట రిలీజైంది. దీంతో ఆ మూవీ లవర్స్.. మా శివగామిని ఇలా మార్చేశారేంటి? అని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 మూవీస్.. అవి మిస్ అవ్వొద్దు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement