చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం అనగానే థియేటర్ల వైపు చూస్తాం. ఏ సినిమా వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం. అయితే ఈ వారంలో సినీ ప్రియులను అలరించేందుకు జేమ్స్ కామెరూన్ అవతార్-3 థియేటర్లకు వస్తోంది. దీంతో పాటు టాలీవుడ్ నుంచి సకుంటుబానాం, గుర్రం పాపిరెడ్డి, జిన్ లాంటి సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే అవతార్-3పైనే ఆడియన్స్‌లో ఎక్కువగా బజ్ ఉంది.
అయితే ఫ్రైడే రోజు అనగానే ఓటీటీ ప్రియులు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ వీకెండ్ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసేవారి కోసం ఓటీటీ మూవీస్ కూడా రెడీ అయిపోయాయి. టాలీవుడ్ నుంచి ప్రియదర్శి ప్రేమంటే, చాందిని చౌదరి సంతాన ప్రాప్తిరస్తూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేలా ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఫ్రైడే స్ట్రీమింగ్ కానున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
ప్రేమంటే (తెలుగు సినిమా) - డిసెంబరు 19
రాత్ అఖేలీ హై- ద బన్సాల్ మర్డర్స్ (హిందీ మూవీ) - డిసెంబరు 19
ద గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సినిమా) - డిసెంబరు 19
ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (హిందీ టాక్ షో) - డిసెంబరు 20
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - డిసెంబరు 19
హ్యుమన్ స్పెసిమన్స్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 19
సంతాన ప్రాప్తిరస్తు(తెలుగు సినిమా) - డిసెంబరు 19
జియో హాట్‌స్టార్
మిసెస్ దేశ్‌పాండే (హిందీ సిరీస్) - డిసెంబరు 19
ఫార్మా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 19
సంతాన ప్రాప్తిరస్తు(తెలుగు సినిమా) - డిసెంబరు 19
జీ5
నయనం (తెలుగు సిరీస్) - డిసెంబరు 19
డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ (మలయాళ సినిమా) - డిసెంబరు 19
సన్ నెక్స్ట్
దివ్యదృష్టి (తెలుగు సినిమా) - డిసెంబరు 19
ఉన్ పార్వైల్ (తమిళ మూవీ) - డిసెంబరు 19
ఆపిల్ టీవీ ప్లస్
బార్న్ టుబీ వైల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 19
లయన్స్ గేట్ ప్లే
రూఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 19


