'మనశంకర వరప్రసాద్‌ గారు'.. మేకింగ్ వీడియో చూశారా? | Chiranjeevi Mana Shankara VaraPrasad Garu Making Video out now | Sakshi
Sakshi News home page

Mana Shankara VaraPrasad Garu Movie: 'మనశంకర వరప్రసాద్‌ గారు'.. మేకింగ్ వీడియో చూశారా?

Dec 18 2025 4:45 PM | Updated on Dec 18 2025 5:49 PM

Chiranjeevi Mana Shankara VaraPrasad Garu Making Video out now

మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మనశంకరవరప్రసాద్‌ గారు'. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాద సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించారు. కేథరిన్‌ కీలక పాత్ర  పోషించారు. ఈ చిత్రాన్ని అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.

మూవీ రిలీజ్‌కు ఇంకా కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే మనశంకరవరప్రసాద్ గారు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సెట్స్‌లో అంతా నవ్వుల సందడే కనిపిస్తోంది. ఈ వీడియో మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చిరంజీవి హవాభావాలు, నయనతార నవ్వులు ఫ్యాన్స్‌ను అలరించేలా ఉన్నాయి.
ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాదికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో సూపర్ హిట్ కోసం రెడీ అవుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement