హర్షవర్ధన్ రాణే,సోనమ్ బాజ్వా జంటగా నటించిన చిత్రం ఏక్ దీవానే కీ దీవానీయత్'. ఈ మూవీ అక్టోబర్ 21న థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.110 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు మిలాప్ జవేరి దర్శకత్వం వహించారు. దేశీ మూవీస్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై అన్షుల్ గార్గ్, దినేష్ జైన్ నిర్మించారు.
తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుందని జీ5 అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో షాద్ రంధావా, సచిన్ ఖేడేకర్, అనంత్ నారాయణ్ మహాదేవన్, రాజేష్ ఖేరా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా లవ్ అండ్ రొమాంంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. దాంపత్య జీవితంలో భార్య, భర్తల మధ్య ఆధిపత్య ధోరణి, వాటివల్ల వచ్చే ఎదురయ్యే సమస్యల ఆధారంగా రూపొందించారు.
This Holiday Season, har gulaab mein ishq dikhega, aur uske kaanton mein Ek Deewane Ki Deewaniyat! 🥀 #EkDeewaneKiDeewaniyat Premieres 26th December, only on #ZEE5#EkDeewaneKiDeewaniyatOnZEE5 pic.twitter.com/IYyhLPACda
— ZEE5Official (@ZEE5India) December 18, 2025


