టాలీవుడ్‌లో డ్యాన్స్ షోలకు ఫుల్ క్రేజ్ ఉంటోంది. అందులో భాగంగానే పలు ఛానెల్స్‌లో డ్యాన్స్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. గతంలో ఆట పేరుతో జీ తెలుగులో వచ్చిన డ్యాన్స్ రియాలిటీ షో ఆట. ఈ షోకు అభిమానుల నుంచి అత్యంత ఆదరణ వచ్చింది. దీంతో మేకర్స్ సరికొత్త సీజన్‌తో మీ ముందుకు రానున్నారు.
ఇందులో భాగంగానే ఆట 2.0 పేరుతో జీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ షోలో పాల్గొగనాలనుకునే వారికోసం ప్రత్యేకంగా ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఈనెల 21 అంటే ఆదివారం హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని సారథి స్టూడియోస్‌లో నిర్వహించనున్నారు. ఈ ఆడిషన్స్‌లో 18 నుంచి 60 ఏళ్ల వరకు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. ఎవరైనా వాట్సాప్ ద్వారా 70322 23913 నంబర్‌కు వివరాలు పంపవచ్చని తెలిపింది. అంతేకాకుండా https://aata.zee5.com వెబ్‌సైట్‌లో వీడియో అప్‌లోడ్ చేసి ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
The stage is set to let your dreams take off..Don't miss this opportunity 🕺💃
Aata 2.0 auditions open now
Message ‘Hi’ to 7032223913 or visit https://t.co/e5EBx9syAw and upload your 2-minute dance video to start your auditions 💥🕺💃#Aata #Aata2PointO #AataAuditions… pic.twitter.com/EY7L4lT6YJ— ZEE TELUGU (@ZeeTVTelugu) November 18, 2025


