టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఛాంపియన్. ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే స్వాతంత్ర్యం కంటే ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బైరాన్‌పల్లి సంఘటన కూడా ఈ ట్రైలర్ చూపించారు. బ్రిటీష్ వారితో పోరాట సన్నివేశాలు ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. 'బైరాన్‌పల్లిలో మొదలైన తిరుగుబాటు ఆ గడ్డమీదే సమాధి కావాలి' అనే డైలాగ్ వింటే ఈ స్టోరీ ఏంటో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందించారు.
From the pages of the history comes a revolutionary saga.
The epic unfolds now.
Presenting #ChampionTrailer to you all!
▶️ https://t.co/dr9tYJMNMV#Champion in cinemas worldwide from DECEMBER 25th, 2025. #Roshan @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @madhie1… pic.twitter.com/rN2dxLp20z— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 18, 2025


