ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ ఈవెంట్ వివాదానికి దారితీసింది. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫ్యాన్స్ ఒక్కసారిగా హీరోయిన్‌ను చుట్టుముట్టడంతో తీవ్ర అసౌకర్యానికి గురైంది. కొందరు ఏకంగా ఆమె తాకేందుకు యత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో హీరోయిన్‌కు భద్రత కల్పించకపోవడంపై పలువురు మండిపడుతున్నారు.
ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను సమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈవెంట్‌కు నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
అసలేం జరిగిందంటే..
ప్రభాస్- మారుతిల సినిమా ది రాజా సాబ్ నుంచి తాజాగా రెండో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని లులూ మాల్‌కు హీరోయిన్ నిధి అగర్వాల్ రావడంతో భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే, ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో తన కారు వద్దకు అభిమానులు చొచ్చుకు వచ్చారు. ఆమెతో సెల్ఫీల తీసుకునేందకు ఎగబడ్డారు. ఈ క్రమంలో మరికొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.


