మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)కు గడ్డుకాలం నడుస్తోంది. ఏ సినిమా చేసినా వైఫల్యమే ఎదురవుతోంది. తనకు మంచి హిట్టు పడి చాలాకలమే అవుతోంది. ఇటీవల ఆయన మాస్ జాతరతో ప్రేక్షకుల్ని పలకరించాడు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. అక్టోబర్ 31న రిలీజైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయకుండానే కనుమరుగైపోయింది.

వీడియో సాంగ్ రిలీజ్
అయితే ఇందులోని కొన్ని పాటలు మాత్రం బాగానే క్లిక్కయ్యాయి. అందులో ఒకటి 'తు మేరా లవర్' సాంగ్. ఇడియట్ సినిమాలోని 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..' పాటను రీమిక్స్ చేసి ఈ సాంగ్ తెరకెక్కించారు. సోమవారం (నవంబర్ 17న) తు మేరా లవర్ పాట ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ మాస్ స్టెప్పులు మీరూ చూసేయండి..


