నరేశ్-పవిత్రా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో వైరల్ | VK Naresh New Year Celebrations With Pavitra Lokesh | Sakshi
Sakshi News home page

VK Naresh: నరేశ్-పవిత్రా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఫోటో వైరల్

Jan 1 2026 5:33 PM | Updated on Jan 1 2026 5:48 PM

VK Naresh New Year Celebrations With Pavitra Lokesh

టాలీవుడ్ సీనియర్‌ నటుడు వీకే నరేశ్ విలక్షణ పాత్రలతో టాలీవుడ్‌లో రాణిస్తున్నారు.  పలు చిత్రాల్లో నటిస్తూ ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా వీకే నరేశ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తన ‍ప్రియురాలు పవిత్రా లోకేశ్‌తో కలిసి జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్‌ సైతం విషెస్ చెబుతున్నారు.

కాగా.. గతంలో  నరేశ్, పవిత్రా లోకేశ్‌ మళ్లీ పెళ్లి అనే చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమాకు నరేష్‌ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. అయితే వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని టాక్. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించకపోయినా చాలా సార్లు వీరిద్దరు జంటగా ఈవెంట్స్‌కు హాజరయ్యారు. మరోవైపు నరేశ్ తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement