టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌కు లెగసీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పాలిటిక్స్ ఈజ్ పర్సనల్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రానికి సాయికిరణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి గోవింద్ వసంత సంగీతమందిస్తున్నారు.
తాజాగా ఈ మూవీకి టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో 'రాజకీయమంటే పులిమీద సవారిలాంటిదంటారు. ఆ పులి మీద నాయకుడు ఒక్కడే కూర్చోవాలా? ఆ కుటుంబం మొత్తం కూర్చోవాలా?' అనే విశ్వక్ సేన్ డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో విశ్వక్‌సేన్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఏక్తా రాథోడ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రావు రమేశ్, సచిన్ ఖేడ్కర్, మురళీ మోహన్, కేకే మేనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


