బిగ్‌ స్కామ్‌పై వెబ్‌ సిరీస్‌.. విడుదలకు లైన్‌ క్లియర్‌ | Bad Boy Billionaires episodes released Court allows Netflix | Sakshi
Sakshi News home page

బిగ్‌ స్కామ్‌పై వెబ్‌ సిరీస్‌.. విడుదలపై ఆంక్షల ఎత్తివేత

Jan 1 2026 4:42 PM | Updated on Jan 1 2026 5:20 PM

Bad Boy Billionaires episodes released Court allows Netflix

సత్యం కంప్యూటర్స్ కుంభకోణం 2009లో దేశాన్ని కుదిపేసింది. ఈ స్కామ్‌ ఆధారంగా నిర్మించిన ‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌: ఇండియా’ డాక్యుమెంటరీ సిరీస్‌ ఎట్టకేలకు విడుదల కానుంది. ఈ సిరీస్‌ విడుదలపై ఉన్న ఆంక్షలను సిటీ సివిల్‌ కోర్టు ఎత్తివేసింది. 2020లోనే విడుదల కావాల్సిన ఈ సిరీస్‌ను నిలిపివేయాలని  బైర్రాజు రామలింగరాజు సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. దీంతో సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ కేసులో న్యాయస్థానం తీర్పు వెళ్లడించింది.

'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ డాక్యుమెంటరీ విడుదలను ఆపాలని  బైర్రాజు రామలింగరాజు సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇందులో అన్నీ అర్థ సత్యాలు ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ సిరీస్‌ను నిర్మిస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసెస్ ఇండియా కూడా సిరీస్‌ రిలీజ్‌ కోసం ఒక పిటీషన్‌ దాఖలు చేసింది. నెట్‌ఫ్లిక్స్‌ తరఫు న్యాయవాది బొమ్మినేని వివేకానంద బలంగా తన వాదనలు వినిపించారు. పత్రికల ద్వారా బహిరంగమైన  డాక్యుమెంట్ల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారని దీంతో పిటిషనర్‌ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపారు.  దేశంలో జరిగిన చారిత్రక మోసాన్ని ప్రజలకు తెలపడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం వెబ్‌ సిరీస్‌ విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదని కోర్టు సూచించింది.

కనుమరుగైన బ్రాండ్..
స్కామ్‌లో కూరుకుపోయిన కంపెనీని విక్రయించేందుకు అప్పటి ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి ఒక టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టెక్ మహీంద్రా... సత్యంను చేజిక్కించుకుని దాని పేరును మహీంద్రా సత్యంగా మార్చింది. ఆతర్వాత మహీంద్రా సత్యంకూడా టెక్ మహీంద్రాలో  పూర్తిగా విలీనంకావడంతో సత్యం కంపెనీ పేరు కాలగర్భంలో కలిసిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement