టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర గతేడాది వరుస సినిమాలతో అభిమానులను అలరించాడు. ఇటీవలే కన్నడ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన మార్క్ చిత్రంలో కనిపించారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నవీన్ చంద్ర మరో సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది.నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హనీ. ఈ సైకలాజికల్ హారర్ మూవీకి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు.
ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా హనీ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి అజయ్ అరసాడ సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


