ఓలే ఓలే.. అన్ని బూతులే.. రవితేజ పాటపై విమర్శలు! | Netizens Fire On Ravi Teja Ole Ole Song | Sakshi
Sakshi News home page

ఓలే ఓలే.. అన్ని బూతులే.. రవితేజ పాటపై విమర్శలు!

Aug 6 2025 4:27 PM | Updated on Aug 6 2025 4:52 PM

Netizens Fire On Ravi Teja Ole Ole Song

ఓలే ఓలే గుంట
నీ అయ్యకాడ ఉంటా
నీ అమ్మకాడ తింటా
నీ వొళ్ళోకొచ్చి పంటా
బుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు లేదు
మంచి లేదు మర్యాద లేదు
అంగీ లేదు లుంగీ లేదు పంచె లేదు
తాడు లేదు బొంగరం లేదు
నీ అమ్మని నీ అక్కని నీ తల్లిని నీ చెల్లిని... పట్టుకుని కాళ్లు మొక్కి పోతా

చదువుతుంటే ఇవేవో బూతు పదాల్లా అనిపిస్తున్నాయి కదా?.. కానీ ఇవి ఓ సినిమాలో ఉన్న జానపద గీతం లిరిక్స్‌.  ఓ స్టార్‌ హీరో ఈ పాటకు స్టెప్పులేశాడు. నెట్టింట  ఈ పాట తెగ వైరల్‌ అవుతుంది. కొంతమంది హీరోహీరోయిన్ల స్టెప్పులను ఎంజాయ్‌ చేస్తుంటే..మరికొంతమంది మాత్రం లిరిక్స్‌పై తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నారు.  జానపద పాట పేరుతో బూతు పాటలు వినిపిస్తున్నారంటూ మండిపడుతున్నారు.  

రవితేజ-శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్‌ జాతర’ లో ఈ  ఫోక్‌ సాంగ్‌ ఉంది. నిన్న పాటను విడుదల చేయగా.. కొన్ని గంటల్లోనే అది వైరల్‌ అయింది. యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అయితే కొంతమంది నెటిజన్స్‌ మాత్రం లిరిక్స్‌పై మండిపడుతున్నారు.  'నీ య‌మ్మ‌...అక్క‌, త‌ల్లి, చెల్లి...'  'బుద్ది, జ్ఞానం సిగ్గు, శ‌రం లేదు...' లాంటి బూతుల‌తోనే పాటని కంపోజ్‌ చేయడం, దానికి రవితేజ లాంటి స్టార్‌ హీరో డ్యాన్స్‌ చేయడం దారుమని కామెంట్‌ చేస్తున్నారు.  ‘జానపదం లో ఇలాంటి పదాలు అసలు బూతులు కావంటూ మరికొంతమంది రవితేజకు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. 

 


ఈ మధ్య సినిమాలో జానపద పాటలు ఎక్కువగా వాడేస్తున్నారు. స్టార్‌ హీరోలు సైతం ఫోక్‌ సాంగ్‌కి స్టెప్పులేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు తెలంగాణ ఫోక్సాంగ్స్మాత్రమే సినిమాల్లో కనిపించేవి. ఇప్పుడు ఉత్తరాంధ్ర జానపద పాటలకు కూడా స్టార్స్స్టెప్పులేస్తున్నారు. అవి బాగా వర్కౌట్అవుతున్నాయి కూడా. అందుకే తాజాగా రవితేజ కూడా ఉత్తరాంధ్ర ఫోక్సాంగ్కి స్టెప్పులేశాడు. రోహిణితో క‌లిసి మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ ఈ పాట‌ను పాడాడు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement