కింగ్‌డమ్‌ మూవీపై వివాదం.. స్పందించిన నిర్మాణ సంస్థ! | Kingdom makers denies disrespecting Sri Lankan Tamils In Movie | Sakshi
Sakshi News home page

Kingdom Movie: 'ఈ కథ పూర్తిగా కల్పితం'.. కింగ్‌డమ్‌ వివాదంపై నిర్మాణ సంస్థ!

Aug 6 2025 4:16 PM | Updated on Aug 6 2025 6:39 PM

Kingdom makers denies disrespecting Sri Lankan Tamils In Movie

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన మాస్ యాక్షన్థ్రిల్లర్కింగ్డమ్. జూలై 31 థియేటర్లలో విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే చిత్రం వంద కోట్ల మార్క్కు చేరువలో ఉంది. సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది.

అయితే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న సినిమాపై వివాదం మొదలైంది. చిత్రంలో కొన్ని సీన్స్శ్రీలంక తమిళులను కించపరిచేలా ఉన్నాయని తమిళ అనుకూల పార్టీ అయిన నామ్ తమిజర్ కట్చి (NTK) కార్యకర్తలు ఆరోపించారు. దీంతో తమిళనాడులోని మధురై, తిరుచ్చిలోని థియేటర్ల వద్ద కింగ్డమ్ చిత్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ చిత్రం ప్రదర్శనను నిషేధించాలని వారు పిలుపునిచ్చారు.

అయితే తాజాగా వివాదంపై కింగ్డమ్నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ స్పందించింది. సినిమాలో శ్రీలంక తమిళులను కించపరచలేదని.. తమపై వస్తున్న కథనాలను ఖండించింది. కథ అంతా కల్పితమని.. నిజ జీవిత సంఘటనలకు సంబంధించినది కాదని నిర్మాతలు తెలిపారు.

"తమిళ ప్రజల మనోభావాలను మేము గౌరవిస్తున్నాము. పక్క రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలో ఎలాంటి సన్నివేశాలు లేవని మేము హామీ ఇస్తున్నాం. ఈ కథ పూర్తిగా కల్పితం. అంతా ఊహజనితమే. ఇదంతా సినిమా డిస్క్లైమర్లోనేప్రస్తావించాం' సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ సినిమా వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటే చింతిస్తున్నామని తెలిపింది. మీరు మా సినిమాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. మరోవైపు తమిళనాడులోని సినిమా పంపిణీదారులు పోలీసు రక్షణ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. శ్రీలంక నేపథ్యంలోనే కింగ్డమ్మూవీని తెరకెక్కించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement