
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా కింగ్‌డమ్ ఫీవర్ నడుస్తోంది. మాస్ హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా విజయ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సారి గట్టిగా కొడుతున్నాం అంటూ ఫ్యాన్స్లో జోష్ నింపారు.
ఈ నేపథ్యంలోనే విజయ్ అభిమానులు కింగ్‌డమ్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్కు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్ వద్ద విజయ్ దేవరకొండ భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. దాదాపు 75 అడుగుల ఎత్తు ఉన్న కటౌట్ను ఫ్యాన్స్ రెడీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
కాగా.. ఇటీవలే ట్రైలర్ లాంఛ్ సందర్భంగా తిరుపతిలో 40 అడుగుల విజయ్ దేవరకొండ కటౌట్‌ను ఆవిష్కరించారు,. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై బజ్‌ను మరింత పెంచింది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో నటులు సత్య దేవ్, వెంకటేష్, అయ్యప్ప శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. 'కింగ్‌డమ్' జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది.
MASSive 75ft Biggest @TheDeverakonda Cut-Out at Sudharshan 35MM, RTC X Roads❤️🔥
Get Ready to Celebrate #VijayDeverakonda’s Rage in #KINGDOM 💥💥💥 #KingdomOnJuly31st pic.twitter.com/gsR0uRcThc— Vijay Deverakonda Celebrations👑 (@VDCelebrations) July 30, 2025