ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope In Telugu From 03-08-2025 To 09-08-2025 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Aug 3 2025 5:28 AM | Updated on Aug 3 2025 5:28 AM

Weekly Horoscope In Telugu From 03-08-2025 To 09-08-2025

మేషం...
మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం.  తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో హోదా పొందుతారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం...
రెట్టించిన ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. పట్టుదల వీడకుండా ముందడుగు వేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తుల ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మిథునం...
మొదట్లో కొంత అయోమయంగా ఉన్నా క్రమేపీ సవ్యంగానే సాగుతుంది. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో ఒక ముఖ్యవిషయంపై సలహాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక పర్యటనలు. వారం చివరిలో శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. కాలభైరవాష్టకం పఠించండి.

కర్కాటకం...
ఆదాయం అంచనాలకు తగినంతగా ఉంటుంది. బంధువుల ప్రోద్బలంతో పనులు చక్కదిద్దుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గతం గుర్తుకు వస్తుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, లేత గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

సింహం...
ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. పనుల్లో ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సేవాభావంతో ముందుకు సాగుతారు. దూరపు బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కొత్త వ్యాపారాలు ఆరంభిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థాయికి చేరతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనయోగం. ముఖ్యమైన చర్చలు సఫలం.  కళాకారులకు ఊహించని సత్కారాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి.తెలుపు, నేరేడు రంగులు.  హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కన్య....
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులు, ఉద్యోగార్ధులకు ఊహించని అవకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వాహన, గృహయోగాలు.  వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు జరుగవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించే అవకాశం. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఎరుపు, లేతగులాబీ రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తుల....
కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కాస్త తీరతాయి.  కష్టపడ్డా అనుకున్న ఫలితాలు దక్కవు.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వీడండి. ఒక సమాచారం విద్యార్థులకు నిరాశ కలిగించవచ్చు. దూరప్రయాణాలు చేస్తారు. మనస్సు కొంత ఆందోళనగా ఉంటుంది. వ్యాపారాలలో నూతనపెట్టుబడులు ఆలస్యమవుతాయి. లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగస్తుల సేవలకు తగిన ప్రతిఫలం పొందలేరు. రాజకీయవర్గాలకు కొత్త వివాదాలు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. శుభవర్తమానాలు. తెలుపు, లేత పసుపు రంగులు.  నృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు. విద్యార్థులు నైపుణ్యానికి గుర్తింపు పొందుతారు. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ప్రత్యర్థుల నుండి కూడా అనుకూల సంకేతాలు రాగలవు..ఆస్తుల కొనుగోలుపై ఉన్న అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు పనిభారం తొలగుతుంది. పారిశ్రామికవేత్తలకు ముఖ్యసమాచారం ఊరటనిస్తుంది. వారం చివరిలో మానసిక అశాంతి. వ్యయప్రయాసలు.  ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు...
కొత్తగా చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు.  ఆరోగ్యం కాస్త మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కళాకారులు విదేశీ పర్యటనలు చేస్తారు. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధననష్టం. ఎరుపు,నేరేడు రంగులు.  ఆదిత్య హృదయం పఠించండి.

మకరం...
సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన ఉద్యోగాల్లో చేరతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు.  భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. గులాబీ, లేత పసుపు రంగులు.  దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కుంభం...
నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. యత్నకార్యసిద్ధి. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందుకుంటారు. ఆస్తి విషయంలో  నూతన ఒప్పందాలు. దేవాలయ దర్శనాలు. సంఘంలో గౌరవమర్యాదలు. ప్రముఖుల నుంచి కీలక సందేశాలు.  వ్యాపారాలు ఆశాజనకంగా  ఉంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు విజయవంతంగా ముగుస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

మీనం.
కొత ్తపనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య  సందేశం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. లేత ఆకుపచ్చ, నీలంరంగులు.  శ్రీలక్ష్మీనరసింహ కరావలంబం  పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement