
మన భారతీయ ఆచార వ్యవహారాలు, సంస్కృతికి ఇంప్రెస్ అయిన ఎందరో విదేశీయలు అనుభవాలను విన్నాం. అంతేగాదు మన భారత్ అబ్బాయిలనే వివాహమాడుతున్న విదేశీయువతులను కూడా చూశాం. కానీ మన భారతీయ అబ్బాయినే చేసుకోవడానికి గల కారణాలు వివరిస్తూ ఓ విదేశీ యువతి సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది.
ఆ పోస్ట్‌లో ఏముందంటే..తాను భారతీయ వ్యక్తిని వివాహం చేసుకోవడానికి గల మూడు కారణాలను షేర్ చేసుకుంది రష్యన్ మహిళ క్సేనియా చావ్రా. వాళ్లతో అందమైన పిల్లలను కనొచ్చని, ఎల్లప్పుడూ రుచికరమైన ఆహారాన్ని వండటమేగాక, ప్రేమగా చూసుకుంటాడని చెప్పుకొచ్చింది. తన పట్ల చాలా కేరింగ్ తోపాటు సదా ప్రేమిస్తాడని చెప్పుకొచ్చింది.
ఆ పోస్ట్‌కి ఆమె నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రపంచంలోనే ఉత్తమ భర్త అనే క్యాప్షన్‌ని కూడా జత చేసి మరీ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ హృదయాన్ని కదిలించేలా అంతర్ సాంస్కృతిక సంబంధాన్ని ప్రతిబింబించింది. ఈ పోస్ట్ చూసి నెటిజన్లు..భారతీయ పురుషులు విదేశీ మహిళ మనసు గెలుచుకుంటున్నారు అని కొందరూ, ఆమె మాటల్లో నిజమైన సంతృప్తి కనిపిస్తుందని, మీరిద్దరూ ఇలానే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దీవిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: అప్పుడు శత్రువు..ఇవాళ జీవత భాగస్వామి..! ఇంట్రస్టింగ్ లవ్‌స్టోరీ..)