
కొన్ని ప్రేమకథలు ఫన్నీగా వెరైటీగా ఉంటాయి. అసలు వీళ్లద్దరికి ఎలా కుదిరిందిరా బాబు అనేలా ఉంటాయి వారి లవ్‌స్టోరీలు. టామ్ అండ్ జర్నీలా కొట్టుకునేవాళ్లే భార్యభర్తలైతే వామ్మో అని నోరెళ్లబెడతారు అంతా. అచ్చం అలాంటి లవ్‌స్టోరీనే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒకప్పుడు ఆమెకు అతడు పరమ శత్రువు..ఇవాళ ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు.
ఫ్రెండ్‌షిప్‌డే రోజున నెట్టింట వైరల్ అవుతున్న ఈ లవ్‌స్టోరీ నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది. ఆంచల్ రావత్ ఒకప్పుటి శత్రవు తన జీవిత భాగస్వామిగా ఎలా అయ్యాడో వివరిస్తూ సోషల్ మీడియాలో తన ప్రేమకథను షేర్ చేసుకున్నారు.
ఆ పోస్ట్ తన భర్తతో తన కథ ఎలా ప్రారంభమైందో చెప్పుకొచ్చారు. పాఠశాల చదువుకునే రోజుల్లో తన భర్త క్లాస్‌మేట్ అని తెలిపింది. అయితే తాను స్కూల్‌డేస్‌లో అబ్బాయిలంటే ఇష్టపడని అమ్మాయిని అని చెప్పుకొచ్చింది. వారితో స్నేహానికి కూడా నో ఛాన్స్ అన్నట్లుగా ఉండేదాన్ని అని నాటి తన బాల్యాన్ని గుర్తుచేసుకుందామె. అయితే తన క్లాస్‌లో అత్యంత సిగ్గుపడు ఒక క్లాస్‌మేట్ తనతో భోజనం షేర్ చేసుకోవడానికి ప్రయత్నించాడట.
దాంతో తనకు చిర్రెత్తికొచ్చి తన లంచ్ బాక్స్‌ని విరగొట్టేసిందట. ఆ రోజు దాదాపు అతడిని ఏడిపించేంత పనిచేశానంటూ నాటి ఘటనను గుర్తుచేసుకుంది. ఆ సంఘటనతో అతడు తనతో ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదట. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఒక మ్యారేజ్ వెబ్‌సైట్ ఆ క్లాస్‌మేట్‌ని చూసిందట. అలా ఇద్దరు కలుసుకున్నారట. అప్పుడు అతడు తన ఫస్ట్ మెసేజ్‌లో ఆమెకు నా టిఫిన్ బాక్స్ కొనిస్తావా అని టెక్స్ట్ పంపించాడట.
అలా మళ్లీ ఇరువురు కలుసుకుని పెళ్లితో ఒక్కటయ్యారట. అలా నాటి శత్రువు తన భర్తగా మారాడంటూ తన ప్రేమకథను పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేగాదు హ్యపీ ఫ్రెండ్‌షిప్ డే పతి దేవ్ అంటూ క్యాప్షన్ కూడా జోడించిందామె. నెటిజన్లు కూడా నాటి వైరం ప్రేమగా చిగురించిందని మాట అంటూ ఆ జంటను ప్రశంసించగా, మరికొందరూ ఊహించని విధంగా ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో చెప్పలేం అని కొందరూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఆడేద్దామా..'అష్టాచెమ్మ'..! అలనాటి ఆటల మజా..)