
హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రి పార్కింగ్ స్థలం నుంచి బాలాపురి బస్తీ వైపు ఓ గేటు ఉంటుంది. ఈ గేటు వద్ద కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిత్యం ఉదయం వేళల్లో 300 నుంచి 500 మందికి అన్నదానం చేస్తుంటాయి. గడిచిన మూడు రోజుల నుంచి నిమ్స్ అధికారులు ఈ గేటు మూసివేశారు. దీంతో రోగుల సహాయకులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి అనారోగ్య సమస్యలతో వస్తుంటారని అలాంటి వారికి అన్నదానం చేస్తుంటే ఆపడం ఎంత వరకు సబబు అని బాలాపురి బస్తీవాసి, అన్నదాత బిట్ల శ్రీనివాస్ రాజు ప్రశ్నించారు. గేటు తెరవకపోతే ఈ విషయమై సంబంధిత శాఖా మంత్రిని కూడా కలిసి నిమ్స్ డైరెక్టర్, అధికారులపై ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు.