రేపు రాష్ట్రవాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు | BRS Calls For Statewide Protests Against Political Harassment Of KCR | Sakshi
Sakshi News home page

రేపు రాష్ట్రవాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు

Jan 31 2026 5:05 PM | Updated on Jan 31 2026 5:16 PM

BRS Calls For Statewide Protests Against Political Harassment Of KCR

సాక్షి, హైదరాబాద్‌: రేపు రాష్ట్రవాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. కేసీఆర్‌ను సిట్‌ విచారణను పిలవడంపై బీఆర్‌ఎస్‌ నిరసనలు చేపట్టనుంది. రేపు  అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ ఆందోళనలు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ తెలిపింది. బైక్‌ ర్యాలీలు, నల్లజెండాలతో నిరసనలు, రాస్తారోకోలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. న్యాయ నిపుణులతో చర్చించాక విచారణకు హాజరుకావాలని కేసీఆర్‌ నిర్ణయించారు. రేపు సిట్‌ విచారణకు కేసీఆర్‌ హాజరుకానున్నారు.

కాగా, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన తీరుపై కేటీఆర్‌ మండిపడ్డారు. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అంటూ సంచలన విమర్శలు గుప్పించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ?. స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?.

65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement