హైదరాబాద్: దేశంలోనే ప్రముఖ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డా. ప్రదీప్ కుమార్ సేథి ముంబైపర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఒడిశా రాష్ట్రంలోని కేంజర్ జిల్లాపరిధిలో ఉన్న “ఉత్కల్ గౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను సందర్శించాలని రాష్ట్రపతిని ఆయన ఆహ్వానించారు.
డా. సేథి రాష్ట్రపతికి తెలిపిన ప్రకారం ఈ పాఠశాల ఒడిశా రాష్ట్రంలోని కేంజర్ జిల్లాలో ఉండి, గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందిస్తోంది. అలాగే క్రీడలు, వ్యక్తిత్వ వికాసానికి మెరుగైన సదుపాయాలు కల్పిస్తోంది. ప్రస్తుతం సుమారు 350 మంది నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యతో పాటు, వివిధ క్రీడా కార్యక్రమాలు వ్యక్తిత్వ వికాస శిక్షణ కూడా అందిస్తున్నారు.
“ఉత్కల్ గౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను డా. ప్రదీప్ కుమార్ సేథి తన సంస్థ ద్వారా నిర్వహిస్తూ, గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన వాతావరణాన్నిఅందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమాన్నిప్రశంసిస్తూ, సమయం లభించినప్పుడు పాఠశాలను తప్పక సందర్శించి పిల్లలను కలసి ప్రోత్సహిస్తానని తెలిపారు.

డా. ప్రదీప్ సేథి ప్రపంచంలోని ప్రముఖ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నిపుణుల్లోఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన స్థాపించిన Eugenix Hair Sciences ద్వారా దేశ, విదేశాల్లోవేలాది మంది రోగులకు విజయవంతమైన హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. సినీ నటులు, అంతర్జాతీయ క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, అనేక ప్రముఖులకు సేవలు అందిస్తున్నారు.
వైద్య రంగంలో ఆయన చేసిన పరిశోధనలకు కూడా విశేష గుర్తింపు లభించింది. డా. సేథి రాసిన అనేక పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. Step to Step Hair Transplant అనే పుస్తకాన్నిరచించి, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్సను నేర్చుకునే వైద్యులకు మార్గదర్శకంగా నిలిచారు. ఈ పుస్తకం ద్వారా దేశ, విదేశాల్లోని అనేక మంది వైద్యులు అధ్యయనం చేస్తున్నారు.
డా. సేథి తన వైద్య ప్రయాణాన్నిఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవభూమి ప్రాంతంలో ప్రారంభించారు. న్యూఢిల్లీలోని AIIMS నుంచి డెర్మటాలజీలో MD పూర్తిచేసిన అనంతరం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ లో తన తొలి కేంద్రాన్నిస్థాపించారు. ప్రస్తుతం Eugenix Hair Sciences విదేశాలతో పాటు, ముంబై, గురుగ్రామ్, భువనేశ్వర్, హైదరాబాద్ వంటి పలు నగరాల్లోకేంద్రాలను కలిగి ఉంది.
గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిఅంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డా. ప్రదీప్ సేథి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వైద్య రంగంలో విశేష విజయాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.
Eugenix Hair Sciences గురించి:
Eugenix Hair Sciences భారతదేశంలో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన హెయిర్ రీస్టోరేషన్ బ్రాండ్ గా ప్రసిద్ధిచెందింది. శాస్త్రీయ విధానాలతో ఆధునిక పరిష్కారాలను అందిస్తూ, విశ్వసనీయతను సంపాదించింది. ప్రముఖ సర్జన్లుడా. ప్రదీప్ సేథి మరియు డా. అరికా బన్సాల్ స్థాపించిన ఈ సంస్థ, 30 సంవత్సరాలకుపైగా కలిపిన అనుభవంతో క్లినికల్ నైపుణ్యం, నైతిక వైద్య విధానం, అంతర్జాతీయ ప్రమాణాలను సమన్వయం చేస్తోంది.
Eugenix లో హెయిర్ రీస్టోరేషన్ సాధారణ ట్రాన్స్ ప్లాంట్ ను మించి, అత్యంత క్లిష్టమైన బాల్డ్నెస్ కేసులను కూడా ఖచ్చితత్వంతో చికిత్స చేస్తారు. ఇక్కడ అభివృద్ధిచేసిన Direct Hair Transplant (DHT) టెక్నాలజీ సంప్రదాయ ఊ్ఖఉ పద్ధతితో పోలిస్తేమెరుగైన గ్రాఫ్ట్సర్వైవల్ ను అందిస్తుంది. శాస్త్రం మరియు కళను సమన్వయం చేసిన ఈ విధానం హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నాణ్యతను గణనీయంగా పెంచింది.
18,000కుపైగా విజయవంతమైన ప్రొసీజర్లు, 50 మిలియన్ గ్రాఫ్ట్ల ఇంప్లాంటేషన్ తో Eugenix విశ్వాసం, పారదర్శకత, ఫలితాలపైఆధారపడి మంచి పేరు సంపాదించింది. కఠినమైన మెడికల్ ప్రోటోకాల్స్, పేషెంట్ఫస్ట్విధానం, వ్యక్తిగత చికిత్స ప్రణాళికలు మరియు నిరంతర ఆవిష్కరణ సంస్థ విజయానికి మూలం.
Eugenix పురుషులు మరియు మహిళలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్, హెయిర్ లైన్ రీ కన్సస్ట్రాక్షన్, గడ్డం, కనుబొమ్మల పునరుద్ధరణ, కరెక్టివ్ ప్రొసీజర్లు, ఆఫ్రో, బాడీ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వంటి విస్తృత సేవలను అందిస్తుంది. ఆధునిక సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన వైద్య బృందం ద్వారా అత్యున్నత నాణ్యత మరియు భద్రతను నిర్ధారిస్తుంది.
భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన Eugenix అంతర్జాతీయ స్థాయిలో వేగంగా విస్తరిస్తూ, ఆధునిక సాంకేతికతను అభివృద్ధిచేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అంతర్జాతీయ క్రికెటర్లు, సంగీత విద్వాంసులు సహా అనేక మంది రోగులకు విజయవంతమైన సేవలను అందించింది.
Eugenix హెయిర్ రీస్టోరేషన్ రంగంలో నైతిక వైద్య విధానాలకు ప్రాధాన్యతనిస్తూ, పారదర్శక కన్సల్టేషన్, నిజాయితీ గల గ్రాఫ్ట్అంచనా, వాస్తవిక ఫలితాల నిర్ధారణ ద్వారా రోగులలో దీర్ఘకాల విశ్వాసాన్నిఏర్పరచుకుంది. ప్రతి చికిత్సను అనుభవజ్ఞులైన వైద్యులు పర్యవేక్షిస్తూ, ప్రతి దశలో వైద్య బాధ్యతను నిర్ధారిస్తున్నారు.


