breaking news
President of India
-
సలహా కోరితే సమాధానమివ్వాలా?
మన రాజ్యాంగం వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాలను సూచిస్తుంది. రాజకీయ వర్గాలకు, ప్రతికూలమైన తీర్పులను ఎత్తి చూపడానికి ఒక సాధనం కావచ్చు. న్యాయ వ్యవస్థకు మాత్రం ఇదొక వేగుచుక్క. చట్టపర మైన ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరడానికి రాష్ట్రపతిని అనుమతించేదే ఆర్టికల్ 143. తాజాగా బిల్లులను పరిష్కరించడంలో గవర్నర్లు, రాష్ట్రపతి అధికారాలకు సంబంధించిన 14 ప్రశ్నలు వేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యాయసలహా కోరి దీన్ని ఉపయోగించారు.సాధారణ సందర్భాల్లో ఇది వివాదాస్పదం అయ్యేది కాదు. కానీ ఈ ప్రశ్నలు తమిళనాడు గవర్నర్ ఉదంతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తేల్చిచెప్పిన అంశాలనే తిరిగి పరిశీలించేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఒక క్లిష్టమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. రాష్ట్రపతి కోరుతున్న న్యాయ సలహా అనేది చట్టబద్ధమైన రాజ్యాంగ చర్యా లేదా సుప్రీం తీర్పును దొడ్డిదారిలో సమీక్షించే ప్రయత్నమా?కోర్టు సమాధానం చెప్పనక్కర్లేదు!ఇటీవల తమిళనాడు కేసు విషయంలో– మంత్రి మండలి సహాయం, సలహా ప్రకారమే గవర్నర్ పనిచేయాలనీ, బిల్లులను ఆమోదించే ప్రక్రియలో నిరవధికంగా ఆలస్యం చేయలేరనీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతితో సహా రాజ్యాంగ అధికారులు జవాబుదారీతనం లేకుండా లేదా కాలపరిమితిని దాటి వ్యవహరించలేరని కూడా ఆ తీర్పు పేర్కొంది. ఈ తీర్పు ఫలితంతో కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి చెందింది. ఫలితంగా ఇప్పటికే కోర్టు సమాధానం ఇచ్చిన వాటికి దాదాపు సమానమైన ప్రశ్నలను సంధి స్తున్న రాష్ట్రపతి న్యాయ సలహాకు కేంద్రం మద్దతు ఇచ్చింది.ప్రజా ప్రాముఖ్యం కలిగిన చట్టపరమైన విషయాలపై సుప్రీంకోర్టు న్యాయ సలహాను, అభిప్రాయాన్ని కోరడానికి ఆర్టికల్ 143 రాష్ట్రపతిని అనుమతిస్తుంది. కోర్టుకు మాత్రం అటువంటి న్యాయ సలహాకు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 1964లో ప్రత్యేక సూచన నం.1లోనూ, అయోధ్య వివాదంపై 1993లో ప్రత్యేక సూచన నం.1లోనూ మనం చూసినట్లుగా, న్యాయ సలహాను ఇవ్వకుండా తిరస్కరించే విచక్షణ న్యాయస్థానానికి ఉంది.కావేరీ జల వివాదాల కేసులో (1998లో ప్రత్యేక సూచననం.1), కోర్టు అప్పటికే ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయడానికి లేదారెండవ అభిప్రాయాన్ని కోరడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించ లేరని స్పష్టంగా పేర్కొంది. ‘రాజ్యాంగం ప్రకారం, అలాంటి అప్పీల్ అధికార పరిధి ఈ కోర్టుకు ఉండదు; ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి కూడా దానిపై సమీక్ష కోరలేరు... అటువంటి అధికారం ఆర్టికల్ 143లో ఉందనుకుంటే, అది న్యాయవ్యవస్థ స్వతంత్ర తలోకి తీవ్ర మైన చొరబాటు అవుతుంది’ అని నాడు కోర్టు నొక్కి చెప్పింది.పునఃపరిశీలన కోరుతున్నట్లయితే...రాష్ట్రపతి తాజాగా వేసిన 14 ప్రశ్నలు తమిళనాడు తీర్పులో ఇప్పటికే పరిష్కరించబడిన అనేక ప్రశ్నలను ప్రతిధ్వనిస్తాయి. గవర్నర్ ఒక బిల్లును అనేకసార్లు వెనక్కి ఇవ్వవచ్చా, లేదా ఆమోదం కోసం రాష్ట్రపతి నిర్దిష్ట కాలపరిమితికి కట్టుబడి ఉండాలా అనేవి వీటిలో ఉన్నాయి. వీటిని సుప్రీంకోర్టు అస్పష్టంగా వదిలివేయలేదు. అత్యంత స్పష్టతతో నిర్ణయం చెప్పేసింది. అందుకే రాష్ట్రపతి తాజా న్యాయ సలహా నివేదన నిజంగా స్పష్టతను కోరడం లేదనీ, పునఃపరి శీలన కోరుతోందనీ సూచిస్తుంది. అలా అయితే, ఇది చట్టపరమైన సమస్య కాదు. న్యాయవ్యవస్థ అంతిమం అనే పునాదినే ప్రశ్నిస్తోంది.2012లో 2జీ స్పెక్ట్రమ్‌పై న్యాయసలహా దీనికి ఒక ముఖ్యమైన మినహాయింపు. ఇక్కడ సుప్రీంకోర్టు మునుపటి తీర్పులోని అంశా లను స్పష్టం చేయడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించింది. కోర్టు 122 టెలికామ్ లైసెన్సులను రద్దు చేసిన తర్వాత, సహజ వనరులను కేటాయించడానికి వేలం మాత్రమే అనుమతించదగిన పద్ధతా అనే దానిపై నాటి కేంద్ర ప్రభుత్వం... సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాన్ని కోరింది. వేలం న్యాయమైన పద్ధతి అయినప్పటికీ, అది మాత్రమే రాజ్యాంగబద్ధమైన మార్గం కాదని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా, కోర్టు ఇచ్చిన ఈ స్పష్టత ప్రధానమైన తీర్పును భంగపరచలేదు. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. 2జీ విషయంలో, తన తీర్పును వెనక్కు తీసుకోవాలని కోర్టును ప్రభుత్వం అడగలేదు. కేవలం భవి ష్యత్ విధానంపై తనకు మార్గనిర్దేశం చేయాలని కోరింది.దీనికి విరుద్ధంగా, తాజాగా రాష్ట్రపతి కోరిన న్యాయ సలహా అనేది తమిళనాడు కేసు తీర్పులోని ప్రధాన విషయానికి వెళుతుంది. ఇది పరిణామాల వివరణ, లేదా భవిష్యత్ కేసులకు మార్గ దర్శకత్వం కోరదు. బదులుగా, కోర్టు ఇప్పటికే సమాధానం ఇచ్చిన ప్రశ్నలను తిరిగి లేవనెత్తుతుంది. దీన్ని అనుమతించడం అంటే సమీక్షను నియంత్రించే ఆర్టికల్ 137ను కార్యనిర్వాహక వర్గం దాటవేయవచ్చు. ఆర్టికల్ 143 ద్వారా కేసులను తిరిగి వ్యాజ్యం చేయవచ్చు. అది రాజ్యాంగపరంగా అనుమతించరానిది, అలాగే వ్యవస్థాగతంగా ప్రమాదకరమైనది.రాష్ట్రపతి కార్యాలయ గౌరవం నిలుపుతూనే...కోర్టుకు స్పందించాల్సిన బాధ్యత ఉందా? లేదు! ప్రత్యేక కోర్టుల బిల్లు కేసులో, కోర్టు ఒక సూచనకు సమాధానం ఇవ్వ డానికి నిరాకరించవచ్చనీ, కాకపోతే అలా చేయడానికి కారణా లను పేర్కొనాలనీ న్యాయస్థానం మాట. 2జీ కేసులో, న్యాయ సలహాను తిరస్కరించడానికి కోర్టు అనేక కారణాలను పొందు పర్చింది: (1) ప్రశ్నలను ఇప్పటికే పరిష్కరించి ఉంటే; (2) ప్రశ్నలు రాజకీయమైనవి అయితే; (3) అవి రాజ్యాంగ ప్రయోజనానికి ఉపయోగపడకపోతే; (4) అవి చట్టపరమైన ప్రాముఖ్యత కలిగిన సమస్యలను కలిగి ఉండకపోతే!తమిళనాడు తీర్పు స్పష్టంగా పరిష్కరించబడిన రాజ్యాంగ ప్రశ్నా విభాగంలోకి వస్తుంది. దీన్ని తిరిగి తెరవడం వల్ల న్యాయ నిర్ణయాల అంతిమత్వంపై సుప్రీం కోర్టుకు కాకుండా కార్య నిర్వాహక వర్గానికి ప్రాధాన్యతను కట్టబెట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ రాజకీయ నేపథ్యాన్ని విస్మరించలేము. అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలోని గవర్నర్లు చట్టాలకు మోకాలడ్డేందుకు కాలయాపన వ్యూహాలను అనుసరించారు.ఇది రాజ్యాంగ ప్రశ్న కంటే ఎక్కువగా – రాజకీయంగా అడ్డుకొనే చర్య. ముఖ్యంగా రాజ్యాంగ సమీక్ష మార్గం ఎల్లప్పుడూ అందు బాటులో ఉన్నప్పుడు... రాష్ట్రపతి న్యాయ సలహాను సుప్రీంకోర్టు అంగీకరిస్తే, అది రాజకీయ ఒత్తిడికి లొంగి పోయినట్టు కనిపించే ప్రమాదం ఉంది. అయితే, కోర్టుకు ఇది క్లిష్టమైనదే. రాష్ట్రపతి కార్యాలయం పట్ల గౌరవాన్నీ, తన నిర్ణయాల సమగ్రతనూ కాపాడు కునే బాధ్యతను సమతుల్యం చేసుకోవాలి.ఈ న్యాయ సలహాను కోరడం నిజంగా తమిళనాడు కేసును తిరగదోడే ప్రయత్నమే అయితే, కోర్టు దానికి సమాధానం ఇవ్వడా నికి నిరాకరించాలి. న్యాయపరమైన తీర్పుల అంతిమత్వాన్ని తప్పించుకోవడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించలేమని స్పష్టంగా పేర్కొ నాలి. అయితే, భవిష్యత్ పాలన కోసం స్పష్టత అవసరమయ్యేఅంశాలు తీర్పులో ఉంటే, కోర్టు సమాధానం ఇవ్వడానికి ఎంచు కోవచ్చు. కానీ అది తన మునుపటి నిర్ణయానికి చెందిన అధికారాన్ని నీరుగార్చకుండా చూసుకోవాలి.ఆర్టికల్ 143 రాజకీయంగా తప్పించుకునే మార్గంగా కాకుండా చట్టపరమైన స్పష్టత కోసం ఒక సాధనంగా ఉద్దేశించబడింది. రాష్ట్రపతి కోరిన ఈ న్యాయ సలహాను పరిశీలన లేకుండా స్వీకరిస్తే, అది కోర్టు అధికారాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది. కోర్టు రాజ్యాంగ వ్యాఖ్యాతగా మాత్రమే కాకుండా, దాని సంరక్షకురాలిగా కూడా వ్యవహరించాలి. సమాధానం ఇవ్వడానికి నిరాకరించడం అనేది రెండింటినీ కాపాడుకోవడానికి స్పష్టమైన మార్గం కావచ్చు.-వ్యాసకర్త సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-సంజయ్ హెగ్డే -
సోలార్ సఖి
రైల్లో తొలిసారి ప్రయాణించిన ఆ మహిళలు.... ‘రైలు ప్రయాణం ఇంత బాగుంటుందా!’ అని సంబరపడి పోయారు. ఆ తరువాత మరో ప్రయాణం మొదలు పెట్టారు.అయితే అది రైలు ప్రయాణం కాదు. తమ జీవితాలను మార్చివేసిన ప్రయాణం. చిన్న చదువులు చదువుకున్న ఎంతో మంది గ్రామీణ మహిళలు సోలార్ ఇంజినీర్లుగా, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణిస్తున్నారు...రాజస్థాన్‌లో నిశ్ఛలగఢ్కు చెందిన తవ్రీదేవి ఎన్నో సంవత్సరాలు విద్యుత్ సౌకర్యం లేని ఇంట్లోనే గడిపింది. అయిదవ తరగతి తరువాత తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో ఇంటి పనులు చేసేది. గొర్రెలు మేపేది. ఇల్లే ప్రపంచంగా బతుకుతున్న తవ్రీదేవి జీవితాన్ని ‘సోలార్ పవర్’ మార్చి వేసింది. హర్మదా(జైపూర్)లో ఐదు నెలల సోలార్ ఇంజినీరింగ్ శిక్షణ కార్యక్రమం ఆమె జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకువెళ్లింది.సోలార్ ఇంజినీరింగ్ శిక్షణ కోసం సిద్ధం అయినప్పుడు.. ‘ఎందుకులే’ అన్నారు తల్లిదండ్రులు. వారిని బలవంతంగా ఒప్పించాల్సి వచ్చింది, ‘మా కమ్యూనిటీలోని మహిళలు ఎప్పుడూ ముసుగు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లలేదు. నేను ఎప్పుడూ పట్టణ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లలేదు’ అంటుంది తవ్రీదేవి.కిషన్‌గడ్‌కు వెళ్లడం...తన తొలి రైలు ప్రయాణం! ‘అది పూర్తిగా కొత్త అనుభవం. ప్రయాణంలోని ఆనందం తెలిసొచ్చింది’ అంటుంది తవ్రీదేవి. శిక్షణలో సోలార్ ఇన్స్టలేషన్, ఫీల్డ్‌వర్క్‌కు అవసరమైన నైపుణ్యాలు సంపాదించింది. ఆ తరువాత స్వగ్రామానికి తిరిగివచ్చింది. ‘మేము చాలా సంవత్సరాలు చీకటిలో జీవించాము. అందుకే మా జీవితాల్లో వెలుగు తీసుకురావాలనుకున్నాను’ అంటుంది తవ్రీదేవి.సోలార్ ఇంజినీర్‌గా కొత్త జీవితాన్నిప్రారంభించిన తవ్రీదేవి తన గ్రామానికి విద్యుత్ వెలుగులు తీసుకువచ్చింది. భారత రాష్ట్రపతి నుండి ‘ఆది సేవా గౌరవ్ సమ్మాన్’ అవార్డ్ అందుకుంది. ఇది కేవలం తవ్రీదేవి విజయగాథ మాత్రమే కాదు... జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, నాగాలాండ్‌తో సహా పదిరాష్ట్రాలలో మూడువేల మందికి పైగా గ్రామీణ మహిళా సోలార్ ఇంజినీర్ల విజయగాథ.తమ గ్రామాల్లో సోలార్ ΄్యానెళ్లను ఒంటిచేత్తో మరమ్మతు చేసే వీరు పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదిగారు. ఈ మార్పుకు కారణం హర్ష్ తివారీ నేతృత్వంలోని ఈఎంపీఐ ఇంటర్నేషనల్. ఈ సంస్థ శిక్షణ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలు సోల్డరింగ్, వైరింగ్, బ్యాటరీ సెటప్, ఫాల్ట్ ఫైండింగ్, ఇన్స్టలేషన్లలోప్రావీణ్యం సాధించారు. గ్రామీణ మహిళలకు సాంకేతిక నైపుణ్యం, ఆర్థికస్వాతంత్య్రం లక్ష్యంగా ఈఎంపీఐ ఇంటర్నేషనల్ పనిచేస్తోంది.శిక్షణ అనంతరం మహిళలు తమ గ్రామాల్లో సోలార్ సొల్యూషన్స్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. మరమ్మతులు, ఫస్ట్‌లెవల్ చెకప్‌లు నిర్వహించేందుకు వీలుగా చిన్న ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. గ్రామస్థాయి ఇంధన మౌలిక సదుపాయాలు సజావుగా సాగేలా చూస్తారు. శిక్షణ పూర్తయిన తరువాత క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మహిళా సోలార్ ఇంజినీర్లను ‘సోలార్ సఖీ’ అని పిలుస్తారు.‘వ్యవసాయంతో పాటు చిన్న తరహా పరిశ్రమలలో సౌరశక్తితో నడిచే పరికరాలకు డిమాండ్ పెరుగుతుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈఎంపీఐ ఇంటర్నేషనల్ సోలార్ సఖీలకు శిక్షణ ఇస్తోంది. జీవనోపాధి కల్పిస్తుంది. టెక్నికల్ ట్రైనింగ్‌తోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కస్టమర్ ఎంగేజ్మెంట్లో కూడా శిక్షణ ఇస్తాం. గ్రామాల్లో సోలార్ సెటప్లలో ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తితే సోలార్ సఖులు పరిష్కారం చూపుతున్నారు’ అంటున్నాడు హర్ష్ తివారీ. -
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
న్యూఢిల్లీ: రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని , సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కౌంటరిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్దేశించబడిన పనులను ఆయా శాఖలు సరిగా చేయకపోతే న్యాయవ్యవస్థ జోక్యం అనేది కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రోజు(శుక్రవారం) ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కపిల్ సిబాల్.. ‘కార్యనిర్వాహక శాఖ తన పని తాను చేయకపోతే జోక్యం చేసుకునే హక్కు న్యాయవ్యవస్థకు ఉంది. అది ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు కల్పించబడిన స్వతంత్ర హక్కు.కార్యనిర్వాహక శాఖ దాని పని అది చేయకపోతే అప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. అది కోర్టులకు కల్పించబడ్డ ప్రాథమిక హక్కు. ఈ దేశంలోని ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ అనేది స్వతంత్రంగా పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. ‘ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలు నన్ను దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రస్తుత రోజుల్లో దేశంలో ఎవరైనా దేనిపైనైనా నమ్మకం ఉంచుతున్నారంటే అది న్యాయవ్యవస్థే. మన దేశంలో రాష్ట్రపతికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. నామమాత్రంగానే వ్యవహరిస్తారు. కేవలం క్యాబినెట్ సలహాలతోనే రాష్ట్రపతి ముందుకు వెళతారు. అంతేకానీ ఇక్కడ రాష్ట్రపతికి ఎటువంటి వ్యక్తిగత అధికారాలు లేవు’ అని కపిల్ సిబాల్ స్పష్టం చేశారు.జగదీప్ ధన్‌ఖడ్ ఏమన్నారంటే..రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు. సుప్రీంకోర్టుకు అలాంటి ఆదేశాలిచ్చే అధికారం ఎక్కడిదని ఆక్షేపించారు. గురువారం రాజ్యసభలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దేశంలో ఏం జరుగుతోంది? అని నిలదీశారు. -
గవర్నర్ల నుంచి రాష్ట్రపతికి బిల్లులు .. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
రాష్ట్రపతి ముర్ముకు స్లొవేకియా వర్సిటీ గౌరవ డాక్టరేట్
బ్రాటిస్లావా: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్లొవేకియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. రాష్ట్రపతి ము ర్ము స్లొవేకియాలో పర్యటిస్తుండటం తెల్సిందే. పోర్చుగల్, స్లొవేకియాల్లో నాలుగు రోజుల పర్యటనలో ఆఖరు రోజైన గురువారం చారిత్రక నిట్ర నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా కాన్స్టంటైన్ ది ఫిలాసర్ వర్సిటీ ముర్ముకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. యూనివర్సిటీ సైంటిఫిక్ కౌన్సిల్ ఈ పురస్కారాన్ని ఆమెకు అందజేసింది. ప్రజలకు ముర్ము అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా డాక్టరేట్‌తో గౌరవిస్తున్నట్లు తెలిపింది. 140 కోట్ల భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నట్లు ముర్ము తెలిపారు. గతంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు ఫెర్నాండో హెన్రిక్ కార్డొసో 2002లో ఈ డాక్టరేట్ అందుకున్నారు. ప్రముఖ తత్వవేత్త సెయింట్ కాన్స్టంటైన్ సిరిల్ పేరుతో ఏర్పాటైన ఈ వర్సిటీలో ఐదు ఫ్యాకల్టీలకు గాను 400 మంది అంతర్జాతీయ విద్యార్థులు సహా 7 వేల మంది విద్యార్థులున్నారు. స్లొవేకియాలోని అత్యంత ప్రాచీన నగరంగా నిట్రకు పేరుంది. అంతకు ముందు, రాష్ట్రపతి ముర్ము ప్రెసోవ్ నగరంలోని బబడ్లో పప్పెట్ థియేటర్లో ప్రదర్శించిన రామాయణం తోలు బొమ్మలాటను తిలకించారు. శ్రీకృష్ణుని భక్తురాలు, భారతీయ సంస్కృతిని అభిమానించే లెంకా ముకోవా అలియాస్ లేఖా స్రవంతి దేవిదాసి ఈ షోను రూపొందించారు. ఈ ప్రదర్శనకు 150 మంది స్లొవాక్ విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం భారతీయ పంచతంత్ర, జాతక కథలు ఇతివృత్తంగా స్లొవాక్ చిన్నారులు వేసిన పెయింటింగ్స్ ఎగ్జిబిషన్‌ను రాష్ట్రపతి ముర్ము తిలకించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడారు. -
రాష్ట్రపతిని కలిసేదాకా ఇక్కడే ఉంటాం: లగచర్ల బాధితులు
న్యూఢిల్లీ, సాక్షి: లగచర్ల ఫార్మా బాధితులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ నేతలు.. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అయితే..ఇప్పటికే లగచర్ల లో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్ట్ లపై ఎస్సి,ఎస్టీ,మహిళ, మానవహక్కుల కమిషన్ లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై భాదితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. లగచర్ల లో గిరిజనులపై జరిగిన అణిచివేత తాలుకు సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరింది. దీంతో బలవంతపు భూ సేకరణ ఘటన, పోలీసులు చేసిన దుర్మార్గపు దాడులను, లైంగిక దాడి వంటి అంశాలతో కూడిన పత్రాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేసినట్లు సమాచారం. అలాగే.. రాష్ట్రపతి ని కలసి తమ గోడు వినిపించాలని.. అప్పటిదాకా హస్తినలోనే ఉండాలని గిరిజన మహిళలు నిర్ణయించుకున్నారు. దీంతో బాధితులను రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు