సాక్షి, తిరుపతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద అర్చకులు ఇస్తీకఫల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని టీటీడీ అందించింది.
రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురవారమే తిరుమల చేరుకున్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బస చేసిన ఆమె.. అంతకు ముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి ద్రౌపది ముర్ము తిరుచానూరు వెళ్లి శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి కాసేపట్లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.


