సాక్షి,ఇరుసుమండ: కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ గ్యాస్‌లీకేజీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గ్యాస్‌లీకేజీపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. లీకైన గ్యాస్‌ను అదుపు చేసేందుకు మరో 24 గంటల సమయం పడుతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. 1993 నుంచి ఆపరేషన్‌లో ఉన్న వెల్‌లో ఈ బ్లో అవుట్ చోటుచేసుకుంది. 2024లో ‘డీప్’ అనే కంపెనీకి సబ్ లీజ్ ఇచ్చారు. 2,500 మీటర్ల లోతులో ఒక లేయర్‌లో ఎక్స్ప్లోరేషన్ ప్రయత్నం జరుగుతుండగా, అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ తన్నుకొచ్చింది. ఒక గంట పాటు గ్యాస్ మాత్రమే బయటికి వచ్చింది. మధ్యాహ్నం 12.30 గంటలకు మంటలు చెలరేగాయి. వెల్‌లో 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజల భద్రత కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఓఎన్జిసి ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. వెల్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకోవడానికి కనీసం మరో 24 గంటలు పట్టే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.
A explosion occurred at the border of Lakkavaram Irusumanda villages in Malikipuram mandal, Konaseema.
Large quantities of gas are gushing out from an ONGC pipeline, spreading like a thick fog for nearly a kilometer.
The incident has triggered panic and fear among local… pic.twitter.com/nvHarm2xmn— Sowmith Yakkati (@YakkatiSowmith) January 5, 2026
ఇరుసుమండ బ్లో అవుట్ పై ఓఎన్జిసి ప్రకటన చేసింది. ‘గ్యాస్ లీక్ ఘటనలో ఎవరూ చనిపోలేదు, ఎవరికి గాయాలు కాలేదు. రిమోట్ ఏరియాలో ఎలాంటి నివాస ప్రాంతాలు లేవు. గ్యాస్ లీక్ ప్రాంతంలో కూలింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాం. క్రైసిస్ మేనేజ్మెంట్ టీములను మొబలైజ్ చేశాం. పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరమైతే గ్యాస్ బావిని మూసివేస్తాం.
అంతర్జాతీయ నిపుణులతో సమన్వయం చేసుకొని, అధునాతన వ్యవస్థతో నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఓఎన్జిసి సీనియర్ మేనేజ్మెంట్ సాంకేతిక ని పనులు పరిస్థితిని నిషితంగా అంచనా వేస్తున్నారు. అవసరమైన అదనపు పరికరాలు నర్సాపురం సహా ఇతర ప్రాంతాల నుంచి పంపిస్తున్నాము’అని తెలిపింది.


