కలెక్టర్‌ ఫొటోతో వాట్సాప్‌ సందేశాలు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ఫొటోతో వాట్సాప్‌ సందేశాలు

Aug 21 2024 9:16 AM | Updated on Aug 21 2024 12:22 PM

కలెక్టర్‌ ఫొటోతో  వాట్సాప్‌ సందేశాలు

కలెక్టర్‌ ఫొటోతో వాట్సాప్‌ సందేశాలు

అమలాపురం రూరల్‌: కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టుకుని జిల్లాలోని అధికారులకు, ఇతరులకు గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్‌ సందేశాలు పంపిస్తున్నారు. వారితో చాటింగ్‌ చేస్తూ సంభాషణ కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ మంగళవారం ప్రకటన విడుదల చేరారు. వాట్సాప్‌ లో చూపిస్తున్న 947855 66071 నంబర్‌ తనది కాదని స్పష్టం చేశారు. ఎవ్వరూ ఆ నంబర్‌ నుంచి మెసేజ్‌లకు స్పందించవద్దని, ఫోన్‌ కాల్స్‌ను స్వీకరించవద్దని తెలిపారు.

పాఠ్య, నోట్‌ పుస్తకాల

పంపిణీ పూర్తి

అమలాపురం టౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్య, నోట్‌ పుస్తకాల పంపిణీ దాదాపు పూర్తయ్యిందని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. వాటిని విద్యార్థులు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కూడా ఆరా తీయాలన్నారు. మలికిపురం మండలం కేశనపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వృక్ష శాస్త్ర అధ్యాపకుడు లేని కారణంగా గెస్ట్‌ లెక్చరర్‌ ఫ్యాకల్టీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించామన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. బోధన చేసిన గంటకు రూ.150 చొప్పున నెలకు రూ.10 వేల మించకుండా గౌరవ భృతి ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఆసక్తి కలవారు ఈ నెల 24వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులను ఆ కళాశాలలో సమర్పించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement