పదెకరాల్లో పంట పోయింది | - | Sakshi
Sakshi News home page

పదెకరాల్లో పంట పోయింది

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మేడిశెట్టి గణపతి కౌలు రైతు. పదెకరాల్లో వరి సాగు కోసం సుమారు రూ.3 లక్షల పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వచ్చే దశలో అర్నబ్‌ తుపాను బీభత్సం సృష్టించింది. పెను గాలులు, భారీ వర్షానికి పంట పూర్తిగా నీట మునిగి పాడైపోయింది. ఇప్పుడు కోతలు కోయించాలన్నా మరో రూ.2 లక్షల ఖర్చవుతుందని ఆయన చెబుతున్నారు. ఎకరాకు రూ.30 వేలకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. పెట్టుబడి పోగా.. కోత ఖర్చులు ఆయనకు అదనపు భారంగా మారాయి. మరోవైపు కౌలు చెల్లించాల్సి ఉంది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితి. తనను వెంటనే ఆదుకోవాలని గణపతి వేడుకుంటున్నారు.

కౌలు చెల్లించేదెలా?

మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన జిల్లెళ్ల నరసింహారావు నిరుపేద కౌలు రైతు. నాలుగెకరాల్లో వరి సాగు కోసం రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. చేతికొచ్చే సమయంలో పంటను తుపాను ముంచింది. తరువాత కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా నీట మునిగి, కుళ్లిపోయింది. కోతలు కోయించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎకరాకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.లక్ష నష్టం వాటిల్లింది. దీనికితోడు కౌలు చెల్లించాల్సి ఉండటంతో ఆయన తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన తనకు పరిహారం కూడా అందకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement