పూర్తిగా నష్టపోయాం | - | Sakshi
Sakshi News home page

పూర్తిగా నష్టపోయాం

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

ఐ.పోలవరం మండలం మురమళ్లకు చెందిన మట్టపర్తి సత్యనారాయణ కూడా కౌలు రైతు. ఎకరాకు 20 బస్తాల ధాన్యం కౌలు ఇచ్చే ఒప్పందంతో పదెకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నారు. తొలకరి పంట సాగుకు ఎకరాకు రూ.28 వేల చొప్పున పదెకరాలకు రూ.2.80 లక్షల పెట్టుబడి పెట్టారు. అర్నబ్‌ తుపాను భారీ వర్షాలు, పెనుగాలుల కారణంగా ఆరెకరాల్లో వరి చేను కోతకు కూడా పనికిరాని విధంగా పూర్తిగా నేలమట్టమైపోయింది. మిగిలిన నాలుగెకరాల్లో మరో 20 రోజుల్లో కోతలు కోస్తే సగం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సత్యనారాయణ చెబుతున్నారు. అయితే, కోతలకు సుమారు రూ.70 వేలు ఖర్చవుతుంది. ఇప్పటికే 60 శాతం పంట నష్టపోయి సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement