సాక్షి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీ గ్యాస్ బ్లోఔట్ మంటలు తగ్గుముఖం పట్టాయి. ఓఎన్జీసీ సిబ్బంది నిరంతర ప్రయత్నాలతో మంటలు చాలావరకు అదుపులోకి వచ్చాయి.
మూడు వైపులా నీటిని వెదజల్లే విధంగా ప్రత్యేకంగా వాటర్ అంబరిల్లా ఏర్పాటు చేశారు. ఈ సాంకేతికతతో మంటలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అదనంగా మరో పైప్‌ను అమర్చుతూ మంటలను మరింత త్వరగా పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.
మరోవైపు బ్లోఔట్ ప్రభావంతో గ్రామంలోని వందలాది కొబ్బరి చెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంటలతో అనేక చెట్లు దగ్ధమయ్యాయి. నాట్లు వేయడానికి సిద్ధంగా ఉంచిన వరి పొలాల్లో నీరు ఇంకిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇరుసు మండ గ్రామంలో జరిగిన బ్లోఔట్ ఘటన స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున భయాందోళన కలిగించినా.. ఓఎన్‌జిసి సిబ్బంది చర్యలతో మంటలు తగ్గుముఖం పట్టడం కొంత ఉపశమనం కలిగించింది. పంటలు, చెట్లు దెబ్బతిన్నా, పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి చేరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న మధ్యాహ్నం ఓఎన్‌జీసీ గ్యాస్ లీకై..
సోమవారం మధ్యాహ్నం నుంచి ఓఎన్‌జీసీ గ్యాస్ లీకైనప్పటికీ.. బావిలో చోటు చేసుకున్న బ్లో అవుట్ మంటలు రెండో రోజు కొనసాగాయి. దీంతో ఇరుసుమండ సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బావి నుండి భారీగా లీక్ అవుతున్న గ్యాస్ ఎగిసి పడుతూ మంటలు విస్తరించాయి. ఈ ఘటనతో గ్రామంలో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలు భయంతో ఇళ్లలోనే తలదాచుకున్నారు. గంటల కొద్ది సమయం గడుస్తున్నప్పటికీ ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీ అదుపులోకి రాలేదు. దీంతో ఢిల్లీ నుండి ఓఎన్‌జిసి నిపుణుల బృందం రంగంలోకి దిగింది. వాటర్ అంబరిల్లా సాంకేతికతతో నాలుగు వైపుల నుండి నీళ్లు విరజిమ్మి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇందుకు అవసరమైన పైప్‌లైన్లు, మిషనరీలను నరసాపురం నుండి తరలించారు.

16 గంటలకుపైగా నిరంతరంగా మంటలు ఎగిసి పడుతున్న ఈ ఘటనతో ఇరుసుమండ గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా సమీప ప్రాంతాల వారు కూడా ఆందోళన చెందారు. నిపుణుల బృందం రాకతో మంటలు అదుపులోకి రావడంతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి.
Fire at an ONGC well in Andhra Pradesh's Konaseema continues to rage a day after a gas leak here led to massive evacuations from three villages within a four-km radius on Monday.
No deaths or casualties have been reported so far.
According to a press release from the Konaseema… pic.twitter.com/dux5wJw2bC— Vani Mehrotra (@vani_mehrotra) January 6, 2026


