బీఆర్‌ నాయుడిని తక్షణమే తొలగించాలి | Bhoomana Karunakara Reddy Fires on BR Naidu | Sakshi
Sakshi News home page

బీఆర్‌ నాయుడిని తక్షణమే తొలగించాలి

Mar 2 2026 5:51 AM | Updated on Mar 2 2026 5:51 AM

Bhoomana Karunakara Reddy Fires on BR Naidu

అశ్లీల వీడియో బయటపడితే డీప్‌ ఫేక్‌ అనడం సిగ్గుచేటు: భూమన 

ఆయనో కామ నాయుడు.. సకల కళావల్లభుడు 

శ్రీవారికి సేవ చేసే అవకాశం వస్తే ఆలయంలో రాజకీయాలు చేశాడు 

వైఎస్‌ జగన్‌పై ఆయన చేసిన తప్పుడు ప్రచారానికి దేవుడే శిక్ష విధించాడు 

దేవుడిని రాజకీయాల్లోకి లాగే వారంతా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నిజంగానే శ్రీవారి భక్తుడే అయితే అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన బీఆర్‌ నాయుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి తక్షణమే టీటీడీ చైర్మన్‌ పదవి నుంచి తక్షణమే తొలగించాలని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి డిమాండ్‌ చేశారు. సకల కళావల్లభుడు, కామ నాయుడు అయిన బీఆర్‌ నాయుడు ఆ పదవికి అనర్హుడని వారించినా చంద్రబాబు ఆలకించలేదని విమర్శించారు. ఏడాదిన్నరగా ఆలయ పవిత్రతను మంటగలిపే కార్యక్రమాలు చేస్తున్నారని ఆధారాలతో సహా బయటపెట్టినా చూస్తూ ఊరుకున్నారని ధ్వజమెత్తారు.

అశ్లీల వీడియో బయటపడితే మరుక్షణమే రాజీనామా చేయించకుండా డీప్‌ ఫేక్‌ వీడియో అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి కాపాడుకునే యత్నం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆలయంలో రాజకీయాలు చేస్తూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పట్ల బీఆర్‌ నాయుడు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే కుట్రలకు ఆ దేవదేవుడే ఈ శిక్ష విధించాడన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలనుకునే వారు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడారు. 

70 ఏళ్లకు పైబడిన వయసులో బీఆర్‌ నాయుడు పర స్త్రీతో చనువుగా ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. చైర్మన్‌ ఆఫీసులో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నారా? అని చర్చించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా చంద్రబాబు ఎలా నియమించారని ప్రపంచవ్యాప్తంగా  స్వామి వారి భక్తులు అసహ్యించుకుంటున్నారు. 

⇒  సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఉమ్మడి గవర్నర్‌ వీడియో ఒకటి బయటకు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. మా హయాంలో ఎస్వీబీసీ భక్తి ఛానెల్‌ అధ్యక్షుడిగా ఉన్న పృథ్వీ అశ్లీల ఆడియో బయటకొచ్చినప్పుడు వెంటనే రాజీనామా చేయించాం.   

⇒  బీఆర్‌ నాయుడి వీడియోలు, ఫొటోలు బయటకు రావడం స్వామి వారి కోపోద్రేకానికి నిదర్శనం. అచ్యుత దేవరాయలు చక్రవర్తిగా ఉన్న సమయంలో తిరుమల ప్రధాన అర్చకుడిగా ఉన్న సిరిఅప్పన్‌ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని ఆలయం ముందరే వధించిన చరిత్ర గురించి చంద్రబాబు తెలుసుకోవాలి. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎవరో చెబితే గుడి మెట్లు కడిగిన పవన్‌ కళ్యాణ్‌ బీఆర్‌ నాయుడి అశ్లీల వీడియోలకు ఏం సమాధానం చెబుతారు?  

⇒  తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలను కించపరిచే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్‌లో తీర్మానం చేశారు. ఆయన వీడియోలు ఆలయ పవిత్రతను కించపరచడం కాదా? బీఆర్‌ నాయుడు హిందూ ధర్మం పేరుతో ఒక ఛానెల్‌ కూడా నడుపుతున్నారు. దర్శనాలు చేయించి డబ్బులు వసూలు చేసి ఆ ఛానెల్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో వేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement