నిర్బంధంతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు | AP Anganwadi Workers Protest: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నిర్బంధంతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు

Mar 2 2026 5:14 AM | Updated on Mar 2 2026 5:14 AM

AP Anganwadi Workers Protest: Andhra Pradesh

నేడు అంగన్‌వాడీల మహాధర్నా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం నిర్బంధంతో అంగన్‌వాడీల ఉద్యమాన్ని అడ్డుకోలేరని సీఐటీయూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు సీఐటీయూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ నాగేశ్వరరావు, సిహెచ్‌.నరసింగరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం విజయవాడలో మహాధర్నా చేపట్టనున్నారని పేర్కొన్నారు.

విజయవాడకు వస్తున్న అంగన్‌వాడీలను కర్నూలు, నంద్యాల రైల్వేస్టేషన్‌లో నిర్బంధించడాన్ని ఖండించారు. ఎమ్మెల్యేలు అంగన్‌వాడీలను తమ ఆఫీసులకు పిలిచి మరీ బెదిరించడం సరికాదన్నారు. రెండేళ్ల నుంచి  వేతనాల పెంపు ప్రకటన రాకపోవడంతో ఆందోళన బాట పట్టారని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement