ఆ వీడియోలో తప్పేముంది? | TTD Chairman BR Naidu Strong Warning | Sakshi
Sakshi News home page

ఆ వీడియోలో తప్పేముంది?

Mar 2 2026 5:09 AM | Updated on Mar 2 2026 5:34 AM

TTD Chairman BR Naidu Strong Warning

మాది 30–32 ఏళ్ల అనుబంధం.. హాయ్‌.. బై.. అనుకుంటాం 

మా ఫ్యామిలీకి, ఆ మహిళ ఫ్యామిలీకి లేని ఇబ్బంది మీకెందుకు? 

తన రాసలీలల వీడియోపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు దబాయింపు 

సోషల్‌ మీడియాలో అవి వైరల్‌ కావడంతో మీడియా సమావేశం 

32 ఏళ్ల పరిచయం ఉన్న వారితో ఇలానే నడుచుకుంటారు 

నాకూ టీవీ చానల్‌ ఉంది.. తోలు తీస్తానంటూ ఎదురు దాడి  

చేసిన తప్పును సమర్ధించుకుంటూ వైఎస్సార్‌సీపీపై బురదజల్లే యత్నం 

భూమన కరుణాకరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలపై ఆరోపణలు  

భగవద్గీతలో ఏమీ లేదని తీవ్ర వ్యాఖ్యలు

చంద్రగిరి: ‘ఆ వీడియో ఒక టాపిక్కేనా? అందులో తప్పేముంది? నేనేమి తప్పు చేశాను? ఆ వీడియోలో నాకేమీ తప్పు కనిపించడం లేదు. 30–32 ఏళ్లుగా పరిచయం ఉన్న కుటుంబంతో అలా మెలగడం తప్పా? హాయ్‌.. బై.. అనుకుంటాం.. అయినా ఆ మహిళ ఫ్యామిలీకి లేని ఇబ్బంది మీకెందుకు?’ అంటూ బట్టబయలైన తన రాసలీలల వీడియోపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఎదురు ప్రశ్నలు వేశారు. అందులో ఎలాంటి తప్పు లేదని సమరి్థంచుకున్నారు. గత రెండు రోజులుగా టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు సంబంధించిన రాసలీలల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరో మహిళతో ఆయన అత్యంత చనువుగా ఉండే వీడియోలు చక్కర్లు కొట్టడం వివాదాస్పదంగా మారింది.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన వాటిపై తొలుత ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ఆ వీడియోలు పూర్తిగా డీప్‌ ఫేక్‌ అని, తనపై కొంత మంది వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని తెలిపారు. అనంతరం కొద్ది సేపటి తర్వాత ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఆ వీడియో నిజమేనని చెబుతూనే కొన్నింటిని మారి్ఫంగ్‌ చేశారన్నారు. ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ కుటుంబంతో తనకు 30–32 ఏళ్లుగా పరిచయం ఉందని, దీంతో ఆమెతో చనువుగా ఉన్న వీడియోను ఎవరో ఇలా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని చెప్పారు.

అయినా ఆ వీడియోలో ఏమి తప్పు ఉందంటూ మీడియాను ప్రశి్నంచారు. ‘32 ఏళ్లుగా పరిచయం ఉన్న వారితో అలాగే నడుచుకుంటారు.. నాకేమీ తప్పు అనిపించడం లేదు. వాళ్లింటికి మేము వెళ్తాము.. మా ఇంటికి వాళ్లు వస్తారు.. అందులో తప్పేముంది? మా ఫ్యామిలి, వాళ్ల ఫ్యామిలీకి లేని ఇబ్బంది మీకు ఎందుకు? సోషల్‌ మీడియాలో వచ్చిన కొన్ని ఫొటోలు 20 ఏళ్ల క్రితం దిగినవి. వాటిని ఎడిటింగ్‌ చేసి వక్రీకరించారు’ అని చెప్పుకొచ్చారు. 

భగవద్గీతలో ఏముంది? 
గత ప్రభుత్వ హయాంలో రూ.50 కోట్లతో ఐదు భాషల్లో సుమారు 50 లక్షల భగవద్గీత పుస్తకాలను ముద్రించారని, అందులో ఇప్పటికీ 32 లక్షల పుస్తకాలు గోడౌన్‌లో అడ్డంగా పడి ఉన్నాయని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అన్నారు. ‘అయినా భగవద్గీతలో ఏముంది.. ఆ భగవద్గీతను చూస్తే మొహాన ఉమ్ముతారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను నిజాయితీగా పని చేస్తున్నందు వల్లే తనపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.  

నేను ఓ మీడియాకు చైర్మన్‌..  
‘నేను కూడా ఓ మీడియా సంస్థకు చైర్మన్‌ను. నా వద్ద సీనియర్‌ జర్నలిస్టులు ఉన్నారు. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టులు కూడా ఉన్నారు. మీ (రాజకీయ నాయకుల) తోలు తీస్తాను. పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ప్రతి రోజూ నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీ లాంటి ఉడతలకు నేను భయపడే వ్యక్తిని కాదు’ అని బీఆర్‌ నాయుడు ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలపై ఆగ్రహంతో ఊగిపోయారు. తన వీడియోలను మారి్ఫంగ్‌ చేసి విడుదల చేస్తే, భయపడే వ్యక్తిని కాదన్నారు.

ప్రతి అంశంలోనూ వారే అవినీతికి పాల్పడ్డారని, అవి బయట పడతాయని తనపై దు్రష్పచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కాగా, సుమారు అరగంటకు పైగా జరిగిన మీడియా సమావేశంలో వైరల్‌ అయిన తన వీడియో వాస్తవం అని ఒప్పుకుంటూనే.. అందులో ఎలాంటి తప్పు లేదని చెబుతూనే.. మరోవైపు మార్ఫింగ్‌ చేస్తున్నారని పొంతన లేకుండా మాట్లాడారు. నాయుడు తీరును చూసి, మీడియా ప్రతినిధులతో పాటు వేదికపై ఉన్న వారు సైతం విస్తుపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement