సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల మూడో తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఆ రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని తెలిపింది. చంద్రగహణాన్ని వీక్షించే అవకాశం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా గ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకే ప్రారంభమైనప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాతే ప్రభావం కనిపిస్తుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని వీక్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉంటుందని తెలిపింది. మళ్లీ ఇలాంటి చంద్ర గ్రహణం 2028, జూలై 6న ఏర్పడుతుందని వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ నగరాల్లో గ్రహణ సమయం
వివరాలు ఇలా..
⇒ విజయవాడ నగరంలో సాయంత్రం 6.14 గంటలకు చంద్రోదయం కానుంది. గ్రహణం సాయంత్రం 6.48 గంటలకు విడుస్తుంది. సుమారు 34నివిుషాలు గ్రహణ ఛాయలు కనిపించనున్నాయి.
⇒ రాజమహేంద్రవరంలో 6.07గంటలకు చంద్రోదయం అవుతుంది. 6.48గంటలకు గ్రహణం ముగుస్తుంది. సుమారు 41 నిమిషాల పాటు గ్రహణం కనిపిస్తుంది.
⇒ నెల్లూరులో సాయంత్రం 6.18 గంటలకు చంద్రోదయం జరుగుతుంది. గ్రహణం ముగిసే సమయం 6.48 గంటలు. నెల్లూరు వాసులు సరిగ్గా 30 నిమిషాల పాటు ఈ ఖగోళ వింతను చూడవచ్చు.


