కోనసీమ జిల్లాలో విషాదం.. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు | 8 Youths Drown In Godavari River Konaseema District | Sakshi
Sakshi News home page

Konaseema: కోనసీమ జిల్లాలో విషాదం.. గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతు

May 26 2025 6:09 PM | Updated on May 26 2025 7:01 PM

8 Youths Drown In Godavari River Konaseema District

సాక్షి,ముమ్మిడివరం: కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముమ్మిడివరం మండలం శేరిలంక గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు.  కాకినాడ నుంచి కె.గంగవరం మండలం శురుల్లంకలో శుభకార్యానికి వచ్చిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు.

లోతైన ప్రాంతం కావడంతో 8 మంది గల్లంతయ్యారు. అప్రమత్తమైన స్థానికులు ముగ్గురు యువకుల్ని కాపాడారు. గల్లంతైన వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్‌, సాయి, సతీష్‌, మహేష్‌, రాజేశ్‌, రోహిత్‌, మహేష్‌గా గుర్తించారు. మిగిలిన ఎనిమిది మంది కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు.

గోదావరిలో స్నానానికెళ్లి 8 మంది గల్లంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement