కరీంనగర్: కరీంనగర్ మేయర్‌తో పాటు మూడు చైర్మన్ పీఠాలు తమవేనని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు(శనివారం, జనవరి 31వ తేదీ) కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ ఇంచార్జ్‌లు, కన్వీనర్లు, కో కన్వీనర్లు సమావేశంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే మా లక్ష్యం. గెలిచే చోట కార్యకర్తలకే సీట్లు ఇస్తున్నాం. గెలిచే అవకాశం లేనిచోట మాత్రమే ప్రత్యామ్నాయ నేతలకు టిక్కెట్లుటిక్కెట్ రాని వారికి నామినేటెడ్, పార్టీ పదవులతో న్యాయం చేస్తాం. తొందరపడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. తప్పుడు ప్రచారాలు నమ్మకండి. డివిజన్లలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని గెలిపించండి’ అని పిలుపునిచ్చారు.


