హైదరాబాద్: హైదరాబాద్ చర్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చర్లపల్లిఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటనలో బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన సురేందర్ రెడ్డి, ఆయన భార్య విజయ, కుమార్తె చేతన రెడ్డి మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం రైలు పట్టాలపై మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలనలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


