
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్‌డమ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యూఎస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కింగ్‌డమ్ మూవీ అంతా సక్సెస్ సంబురాల్లో మునిగిపోయింది. మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి హైదరాబాద్‌లో సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మీ అందరి ప్రేమ, అభిమానం వల్లే ఇదంతా సాధ్యమైందని విజయ్ దేవరకొండ అన్నారు. మీ సపోర్ట్తో మరిన్ని మంచి సినిమాలు చేస్తానని తెలిపారు. ఉదయం నుంచి నాకు ఫోన్ చేసి అన్నా... మనం కొట్టినాం అని ఎంతోమంది నన్ను ఏడిపించేశారని ఎమోషనలయ్యారు. మా మేనేజర్ అనురాగ్ సైతం ఏడ్చేశారు. ఈ సినిమా విజయంతో నాకు బిగ్ రిలీఫ్ దక్కింది. నా వెనుక మీరు ఎంతమంది ఉన్నారో చూస్తూనే ఉన్నా.. నా ఫ్యాన్స్ అందరి ప్రేమ, ఆదరణ వెలకట్టలేనిది అన్నారు. యూఎస్ ఫ్యాన్స్‌ను తప్పకుండా కలుస్తా.. ఆగస్టులో అమెరికాకు వస్తా అని విజయ్ దేవరకొండ వెల్లడించారు.