
పాలిటిక్స్ కంటే పిజ్జా గురించే మన వాళ్లు ఎక్కువగా ఆలోచిస్తున్నారని ‘ఇండియా ఓవర్ థింకింగ్ రిపోర్ట్’ పేరిట సెంటర్ ఫ్రెష్ యూ గోవ్ సంయుక్తంగా నిర్వహించిన తాజా జాతీయ స్థాయిఅధ్యయనం వెల్లడైంది.
ఈ రిపోర్ట్ ప్రకారం.. ఓవర్ థింకింగ్‌లో ముందున్న మన దేశవాసులు రాజకీయాల కంటే పిజ్జా గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు తేలింది. దేశవాసుల ఆలోచనల్లోనూ, రోజువారీ జీవనశైలిలోనూ అతి ప్రభావితం చేస్తోందని, సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, అత్యంత సాధారణమైన విషయాలకు సంబంధించిన నిర్ణయాల్లోనూ, ఆలోచనల్లోనూ అతి కనిపిస్తోందని ఈ నివేదిక చెబుతోంది.
81 శాతం మందిలో..
దేశంలో 81 శాతం మందికి రోజుకి మూడు గంటలకు పైగా ఓవర్‌థింకింగ్ అలవాటైంది. వాట్సాప్ మెసేజ్‌కి ఎలా స్పందించాలో, భోజనానికి ఏం తినాలో, లేదా ఇన్‌స్ట్రాగామ్‌లో ఏ ఫొటో పోస్ట్ చేయాలో అనేటటువంటి ప్రతి చిన్న విషయంలోనూ ప్రజలు ఆలోచనల ఊబిలో మునిగిపోతున్నారని నివేదిక స్పష్టం చేస్తోంది.
రెస్టారెంట్‌లో డిష్ ఎంపిక చేయడం అనేది రాజకీయ నాయకుడిని ఎంచుకోవడంకన్నా ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తోందని 63% మంది చెప్పడం విశేషం.
(చదవండి: అరచేతిలో అనర్థం..! మొబైల్ ఫోబియాపై నిపుణులు ఆందోళన..)