
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ విజయ్ దేవరకొండ. ఈ సినిమా రిలీజ్కు అంతా రెడీ అయిపోయింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలు భారీగా పెంచేసింది. ఈ నెల 31న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ, నాగవంశీ సమాధానాలిచ్చారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కింగ్‌డమ్ ట్రైలర్ చివర్లో ఓ కెమియో రోల్ను చూపించారు. ఆ రోల్‌లో ఉన్నది స్టార్ హీరోనా? అని అడిగారు. ఇది మీరు థియేటర్లోనే చూడాల్సిందే అని విజయ్ దేవరకొండ అన్నారు. అలాగే మీరు ఊహించినట్లే పెద్ద హీరోనే ఉంటాడని చెప్పారు. దీంతో అభిమానులు ఇంతకీ ఎవరా హీరో అంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు.
కాగా.. కింగ్‌డమ్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కలన్నీ ట్రైలర్‌తో పటాపంచలయ్యాయి. ట్రైలర్ చూశాక కింగ్‌డమ్ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ట్రైలర్ విజయ్ దేవరకొండ, సత్యదేవ్ యాక్షన్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. బుల్లెట్ల వర్షం కురిపించిన ఈ ట్రైలర్‌లో.. చివర్లో కాంతార స్టైల్లో కనిపించిన వ్యక్తి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఆ స్టార్ కెమియో ఎవరు అంటూ నెట్టింట చర్చ మొదలైంది.
అయితే మొహానికి మాస్క్ ధరించి కాంతార స్టైల్లో కనిపించిన ఆ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టండి అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ రక్షిత్ శెట్టి అని.. మరికొందరేమో హీరో నాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ట్రైలర్‌లో ఉన్న స్టార్ ఎవరో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.
Who Is That Big Hero? pic.twitter.com/w5M7x0SKMH