
ముఖం కేవలం మేకప్ వేసినప్పుడే మిలమిలా అదిరిపోయేలా ఉండకూడదు. లేనిప్పుడూ కూడా సహజ సౌందర్యంతో అందంగా కనిపించాలి. అందుకోసం ఏం చేయాలంటే..
ముఖం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. శుభ్రంగా ఉన్నప్పుడు అందంగా కనిపిస్తుంది. ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు సహజసిద్ధమైన లేదా తేలికపాటి క్లెన్సర్స్, ఫేస్ వాష్‌లను వాడాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడే గాక, బయట నుంచి ఇంటికి వచ్చాక కూడా ముఖాన్ని శుభ్రంగా కడిగితే మొటిమలు లేకుండా ముఖం తేటగా కనిపిస్తుంది.
వారానికి రెండుసార్లు సున్నిపిండి, స్క్రబ్బర్‌లను వాడడం ద్వారా ముఖం మీద పేరుకు΄ోయిన మృత కణాలు వదిలి΄ోయి ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది.
ముఖం అందంగా కనిపించాలంటే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండాలి. చుండ్రు రాకుండా జుట్టుని కాపాడుకోవాలి. జుట్టు
మృదువుగా, మెరిసిపోవడానికి తగిన జాగ్రత్తలు పాటిస్తే ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.
(చదవండి: Mona Singhs weight loss journey: యోగా, డైట్‌తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్‌గా మోనాసింగ్)