
బరువు తగ్గడంలో ఎందరో ప్రముఖుల, సెలబ్రిటీలు స్ఫూర్తిగా నిలిచారు. అయినప్పటికీ అత్యంత కష్టసాధ్యమైన ఈ టాస్క్‌ని వ్యసనంలా చేస్తే ఈజీగా బరువు తగ్గిపోవచ్చట. అలా పూర్తి ఫోకస్ పెట్టి చేస్తేనే..కచ్చితంగా త్వరిత గతిన బరువు తగ్గిపోతారట. అదీగాక చూస్తుండగానే వేగవంతంగా మనలో వస్తున్న మార్పులను చూసి ఆత్మవిశ్వాసంగా ఫీలవుతామని అంటోంది ప్రముఖ బాలీవుడ్ నటి మోనాసింగ్. అదెలాగో సవివరంగా చూద్దామా..!.
బాలీవుడ్ టెలివిజన్ సీరియల్‌తో జస్సీ జైస్సీ కోయి నటి మోనాసింగ్ పలు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. లాల్ సింగ్ చద్దా, అమావాస్, 3 ఇడియట్స్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చివరగా ముంజియా అనే మూవీలో కనిపించారు. గత కొంత కాలం మూవీలకు దూరంగా ఉన్నా ఆమె పాన్ పర్దా సర్దా అనే గ్యాంగ్ స్టర్ సిరీస్ కోసం బరువు తగ్గాలని నిర్మాతలు కోరడంతో వెయిట్ లాస్ అయ్యేందుకు సద్ధమైనట్లు తెలిపింది.
వాస్తవానికి ఆమె కూడా గత కొన్నాళ్లుగా బరువు తగ్గాలని అనకుందని గానీ కుదరలేదు. కొత్త ఏడాది సందర్భంగా కూడా బరువు తగ్గే ప్రయత్నం చేయాలనకున్నా సాధ్యం కాలేదు. కానీ ఆ సిరిస్‌లో తన పాత్ర కోసం బరువు తగ్గక తప్పదని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి వెంటనే కసరత్తులు ప్రారంభించింది.
నిజానికి బరువు తగ్గడం అనగానే నచ్చిన ఆహారం త్యాగం చేయడం అని ఫీలవుతుంటారు. కానీ ఫలితాలు మంచిగా వస్తున్నప్పుడల్లా అదేమంతా భారమైన పని కాదని అదిమలనో భాగమయ్యేలా వ్యసనంలా మారిపోతుందని అంటోంది మోనాసింగ్.
బరువు తగ్గడం అంటే..
మంచి ఆకృతిలోకి మారి అందంగా కనిపించడం అనుకుంటే ఏమంత కష్టం కాదట. తాను వెయిట్ లాస్‌కి ఉపక్రమిస్తున్నా అనగానే..తినే ఆహరంపై స్పష్టత కలిగి ఉండటం, వ్యాయామాలు చేయడమని ఫిక్స్ అయ్యానంటోంది. తన యోగా గురువు చెప్పిన అద్భత ట్రిక్ ఫాలో అవ్వడంతోనే కేవలం ఆరునెలల్లో ఏకంగా 15 కిలోలు తగ్గానని అంటోంది.
"రోజుకి ఒకపూట తింటే ఆరోగ్యం, అదే రెండు పూటలా తింటే అనారోగ్యం, అలా కూడా కాకుండా మూడు పూటలా తింటే రోగి" అని ఆదే ఆరోగ్య సూత్రమని చెప్పుకొచ్చింది. తాను ఆరోగ్యకరమైన జీవనశైలితోనే ఇంతలా బరువు తగ్గినట్లు వివరించింది. రాత్రి 9.30 కల్లా నిద్రపోతే సగం అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటోంది.
మనకోసం మనం సమయం కేటాయించు కోవాలని సూచించింది. ఇన్నాళ్లు సోమరితనం కారణంగానే దీన్ని సాధించలేకపోయాని చెప్పింది. ఆరోగ్యకరమైన బరువుని నిర్వహించడమే కష్టం తప్ప బరువు తగ్గడం కష్టం కాదంటోదామె. ఆరోగ్య నిపుణుల సంరక్షణలో మంచి జీవనశైలిని పాటిస్తే త్వరితగతిన మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతోంది మోనాసింగ్.
(చదవండి: ఆ మట్టి'..మెళియాపుట్టి..! ఔరా అనిపిస్తున్న కళాకారులు..)