ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరిగిపోయింది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మీ ముందు వచ్చేస్తోంది. ఇప్పటికే రిలీజై క్రేజ్ దక్కించుకున్న కొహరా వెబ్ సిరీస్ సీజన్-2 స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో మోనా సింగ్, బరున్ సోబ్తి కీలక పాత్రల్లో నటించారు.
ఈ నేపథ్యంలోనే కొహరా సీజన్-2 ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే హత్యల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మర్డరీ మిస్టరీ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు ఇష్టపడేవారు కొహరా చూసేయండి.


