అందరినీ మెప్పించే ప్రేమ కడలి.. రిలీజ్ ఎప్పుడంటే? | Tollywood Prema Kadali Trailer Launch Event In Hyderabad | Sakshi
Sakshi News home page

Prema Kadali Movie: అందరినీ మెప్పించే ప్రేమ కడలి.. రిలీజ్ ఎప్పుడంటే?

Jan 29 2026 3:56 PM | Updated on Jan 29 2026 4:04 PM

Tollywood Prema Kadali Trailer Launch Event In Hyderabad

టాలీవుడ్ మూవీ ప్రేమ కడలి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన సుబ్బారెడ్డి, సుజాత, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్  నాని పిల్లిబోయిన  మాట్లాడుతూ..'గల్ఫ్‌లో ఉంటూ సినిమా తీయాలనే ప్యాషన్‌తో ఎంతో కష్టపడి తీశాం. ఈ సినిమా తీయడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది.నాకు ఎంతో సపోర్ట్ చేసిన నా భార్య అయినా రాధకి,తన మిత్రులకి ధన్యవాదాలు. ఈ మూవీకి అందరూ సపోర్ట్ చేయాలి. అలాగే ఈ సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుంది' అని అన్నారు. సంగీత దర్శకుడు లలిత్ కిరణ్ మాట్లాడుతూ..'ఈ సినిమాకి మంచి సంగీతం అందించినందుకు చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు అందించినందుకు చాలా ఆనందంగా ఉందని లిరిక్స్ అందించిన జయసూర్య  అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement