‘యంగ్‌ టైగర్‌' ట్యాగ్ ఎవరూ వాడొద్దు.. ఎన్టీఆర్‌కు కోర్టు రక్షణ | Delhi High Court Passed Order Protecting The Personality And Publicity Rights Of Acclaimed Jr NTR | Sakshi
Sakshi News home page

‘యంగ్‌ టైగర్‌' ట్యాగ్ ఎవరూ వాడొద్దు.. ఎన్టీఆర్‌కు కోర్టు రక్షణ

Jan 29 2026 2:19 PM | Updated on Jan 29 2026 3:18 PM

Delhi High Court Passed Order Protecting The Personality And Publicity Rights Of Acclaimed Jr NTR

జూనియర్ ఎన్టీఆర్‌ హక్కులకు రక్షణగా ఢిల్లీ హైకోర్టు  ఉత్తర్వులు

ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు సంబంధించిన ప్రైవసీ హక్కులను కాపాడాతూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తన ప్రమేయం లేకుండా సోషల్‌ మీడియాలో కొందరు వ్యక్తులు తన హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఎన్టీఆర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో తారక్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది.

తన అనుమతి లేకుండా ఎన్టీఆర్‌ పేరుతో పాటు ఆయన ఫోటోలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం నేరమని కోర్టు తెలిపింది. దీనివల్ల ఆయన హక్కులకు భంగం కలుగుతోందని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని,  హైకోర్టు ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించింది. NTR, Jr. NTR, NTR Jr, Tarak, Nandamuri Taraka Rama Rao Jr., Jr. Nandamuri Taraka Rama Rao వంటి పేర్లతో పాటు Man of Masses, Young Tiger అనే నిక్‌ నేమ్స్‌ను ఎవరూ ఉపయోగించరాదని కోర్టు సూచించింది. వాణిజ్యపరంగా ఆయన అనుమతి లేకుండా ఎవరైనా ఈ పేర్లను ఉపయోగించి ఉంటే చట్ట ప్రకారం తొలగించాలని కోర్టు ఆదేశించింది.

దేశంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అందరికీ సుపరిచిత నటుడని కోర్టు తెలిపింది.  భారతదేశంలో ఎంతో ఉన్నత హోదాను కలిగి ఉన్నారని గుర్తు చేసింది. తన విజయవంతమైన కెరీర్‌లో అపారమైన ఖ్యాతిని పొందారని స్పష్టంగా గుర్తించింది. దీంతో ఆయన ప్రైవసీ హక్కులను రక్షించకపోతే ఆయనకు  నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చాలా స్పష్టంగా కోర్టు పేర్కొంది.

ఆన్‌లైన్‌ సంస్థలతోపాటు జాన్‌ డో లాంటి వ్యక్తులను (ఊరూపేరూ లేకుండా సెలబ్రిటీల పేర్లను దుర్వినియోగం చేసేవారు) ఆయన పేరు, చిత్రాలను వాడకుండా నిషేధించింది. ఎన్టీఆర్‌ ఫోటోలను మార్ఫింగ్‌ చేసినా.. ఆయన పేరును  దుర్వినియోగం చేసినా నేరం కిందకు వస్తుందని కోర్టు హెచ్చరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement